అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి | take ambedkar should ideally | Sakshi
Sakshi News home page

అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి

Apr 15 2014 2:10 AM | Updated on May 29 2018 4:06 PM

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను ప్రతిఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని వైఎస్సార్ సీపీ లోక్‌సభ అభ్యర్థి సింగిరెడ్డి రవీందర్‌రెడ్డి అన్నారు.

శివాజీనగర్, న్యూస్‌లైన్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను ప్రతిఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని వైఎస్సార్ సీపీ లోక్‌సభ అభ్యర్థి సింగిరెడ్డి రవీందర్‌రెడ్డి అన్నారు.సోమవారం జిల్లా కేంద్రం లోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు.  ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి రవీందర్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ అర్బన్ అభ్యర్థి అంతిరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
 
అనంతరం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ..అంబేద్కర్  అడుగు జాడల్లో యువత నడవాలన్నారు. అనంతరం శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. అంబేద్కర్ గొప్ప ఆశయంతో  ముందుకు సాగారన్నారు. ఆయన రచించిన రాజ్యాంగంతో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, ప్రతి ఒక్కరు ఆయన ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.  
 
రానున్న ఎన్నికల్లో నిజాయితీ పరులైన వ్యక్తులనే ఎన్నుకోవాలని  సూచిం చారు. అనంతరం రూరల్ అభ్యర్థి బొడ్డు గంగారెడ్డి మాట్లాడుతూ... ప్రస్తుతం కొనసాగుతున్న రిజర్వేషన్ సౌకర్యం ఎస్సీ, ఎస్టీలతో పాటు, ఓబీసీలకు కూడా వర్తింపజేయాలన్నారు.  రానున్న ఎన్నికల్లో నిజాయితీ పరులకు పట్టం కట్టాలని కోరారు.  అనంతరం స్థానిక పులాంగ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.  కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు ఇస్మాయిల్, సంతోష్‌రెడ్డి, శంకర్, ప్రమోద్  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement