బాలికపై తహసీల్దార్ అత్యాచారయత్నం | Tahasildar on child molest | Sakshi
Sakshi News home page

బాలికపై తహసీల్దార్ అత్యాచారయత్నం

May 26 2015 12:54 AM | Updated on Apr 4 2019 2:50 PM

ఖమ్మం జిల్లా గుండాల ఇన్‌చార్జి తహసీల్దార్ సురేష్(40) సోమవారం ఓ బాలికపై అత్యాచారయత్నం చేశాడు. బాధితురాలి

గుండాల: ఖమ్మం జిల్లా గుండాల ఇన్‌చార్జి తహసీల్దార్ సురేష్(40) సోమవారం ఓ బాలికపై అత్యాచారయత్నం చేశాడు. బాధితురాలి బంధువులు అతనిపై దాడి చేసి ఖమ్మం టూటౌన్‌లో అప్పగించారు. కొత్తగూడెంకు చెందిన సురేష్ (40) గుండాల ఇన్‌చార్జి తహసీల్దార్‌గా పనిచేస్తున్నాడు. ఖమ్మంలోని మామిళ్లగూడెంలో ఉంటున్నాడు. బూర్గంపాడు మండలంలోని ఓ ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక ఖమ్మంలోని బంధువుల ఇంటికి వచ్చింది.

సురేష్ ఇంటి పక్కనే వారి ఇల్లు ఉంది. ఈ క్రమంలో సురేష్ ఆ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలిసి బాలిక బంధువులు దేహశుద్ధి చేశారు. ఖమ్మం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. 454 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement