గాంధీభవన్ నుంచి రాజ్భవన్కు కాంగ్రెస్ నేతలు చేపట్టిన పాదయాత్రకు అనుమతి లేదని డీసీసీ కమలాసన్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్: గాంధీభవన్ నుంచి రాజ్భవన్కు కాంగ్రెస్ నేతలు చేపట్టిన పాదయాత్రకు అనుమతి లేదని డీసీసీ కమలాసన్ రెడ్డి తెలిపారు. ప్రజలకు అసౌకర్యం కలిగించేలా వారు పాదయాత్ర చేశారని వెల్లడించారు. అందుకే వారిని అరెస్ట్ చేసి గోషామహాల్ పీఎస్కు తరలించినట్లు చెప్పారు. అయితే వారిపై ఏ కేసులు పెట్టాలో పరిశీలిస్తున్నామన్నారు.
కాంగ్రెస్ నేతలు శనివారం చేపట్టిన పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాలతోపాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాంపల్లి వద్ద కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పొన్నాల, షబ్బీర్ అలీ, గండ్ర, వీహెచ్, దానం సహా పలువురు నేతలు అరెస్ట్ అయ్యారు.