ఓ రైతుకు స్వైన్‌ఫ్లూ సోకింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌కు చెందిన మహ్మద్ ఆసిఫ్(29) రైతు.
మొయినాబాద్: ఓ రైతుకు స్వైన్‌ఫ్లూ సోకింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌కు చెందిన మహ్మద్ ఆసిఫ్(29) రైతు. ఆయనకు ఈనెల 6న దగ్గు, జ్వరం రావడంతో స్థానిక ఆస్పత్రిలో చూపించుకున్నాడు. ఫలితం లేకపోవడంతో కుటుంబీకులు లంగర్‌హౌస్‌లోని ప్రీమియర్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఈనెల 10న పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. స్వైన్‌ఫ్లూ సోకిందని నిర్ధారించారు. ఆయన ఆరోగ్యం క్షీణించినా ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.