వ్యక్తి అనుమానాస్పద మృతి | suspicious death of a person | Sakshi
Sakshi News home page

వ్యక్తి అనుమానాస్పద మృతి

Dec 6 2015 11:34 AM | Updated on Aug 17 2018 2:53 PM

ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘనట ఆదివారం ఆదిలాబాద్ జిల్లా లో చోటు చేసుకుంది.

ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘనట ఆదివారం ఆదిలాబాద్ జిల్లా లో చోటు చేసుకుంది. వివరాలు.. అదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట మండలం జెండావెంకటాపూర్ గ్రామానికి చెందిన అర్జయ్య(45) వ్యవసాయం చేసుకుంటు జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తి ఆదివారం ఉదయానికి విగత జీవిగా పడి ఉన్నాడు. ఇది గుర్తించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



 

Advertisement
 
Advertisement
Advertisement