ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య

The suicide of a young man - Sakshi

రాయికల్‌ (జగిత్యాల): అనుకున్న ఉద్యోగం రాలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం అల్లీపూర్‌ గ్రామంలోని కుర్మపల్లికి చెందిన షెట్టి రాజు (26) హైదరాబాద్‌లోని గ్లోబల్‌ కాలేజ్‌లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేశాడు. అక్కడే పలు కంపెనీల్లో పనిచేశాడు. ఆగస్టు 9న ఆస్ట్రేలియాకు వెళ్లి కొంతకాలం పనిచేసి తిరిగి జనవరిలో స్వగ్రామానికి వచ్చాడు.

ఇటీవల హైదరాబాద్‌లో జపాన్‌ దేశంలోని ఓ హోటల్‌కు సంబంధించిన ఇంటర్వ్యూకు హాజరు కాగా.. ఒక్క మార్కుతో అందులో ఫెయిల్‌ అయ్యాడు. 15 రోజుల క్రితం అన్నీ సర్దుకొని ఇంటికొచ్చాడు. తిరిగి తాను ఎక్కడికీ వెళ్లనని కుటుంబసభ్యులకు తెలిపాడు. గురువారం జగిత్యాలకు వెళ్లి వస్తానని చెప్పిన రాజు మళ్లీ ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన కోసం గాలించగా పొలంలోనే చెట్టుకు ఉరివేసుకుని శవమై కనిపించాడు. చేతికందివచ్చిన కొడుకు చనిపోవడంతో ఆ కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top