విద్యార్థులు ఓటుహక్కు వినియోగించుకోవాలి | Students Must Use Their Votes | Sakshi
Sakshi News home page

విద్యార్థులు ఓటుహక్కు వినియోగించుకోవాలి

Nov 24 2018 8:17 AM | Updated on Nov 24 2018 8:17 AM

Students Must Use Their Votes - Sakshi

నమూనా బ్యాలెట్‌ వద్ద సెల్ఫీ దిగుతున్న విద్యార్థులు

సాక్షి, కరీంనగర్‌ : ఓటు హక్కు కలిగిన విద్యార్థులందరూ వినియోగించుకోవాలని శ్రీచైతన్య జూనియర్‌ కళాశాల చైర్‌పర్సన్‌ శ్రీలత పిలుపునిచ్చారు. శుక్రవారం భగత్‌నగర్‌ నుంచి బస్టాండ్‌ వరకు ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్‌ కేంద్రంలో ఏర్పాటు చేసిన బ్యాలెట్‌ నమూనా తీరును, ఓటు వేసే విధానాన్ని విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్‌ పవన్‌కుమార్, ఎండీ.సత్తార్, ప్రిన్సిపాల్‌ శ్రీకన్య, సరస్వతి, నిరూష, తేజస్విని, భవాని తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement