తల్లి మందలించిందని కుమార్తె ఆత్మహత్య | student suicide | Sakshi
Sakshi News home page

తల్లి మందలించిందని కుమార్తె ఆత్మహత్య

Aug 4 2016 12:00 AM | Updated on Nov 9 2018 5:02 PM

తల్లి మందలించిందని ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని లోహితలో చోటు చేసుకుంది.

లోహిత(సంగెం): తల్లి మందలించిందని ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని లోహితలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లోహిత శివారు పెద్దతండాకు చెందిన గుగులోత్‌ భద్రి, చక్రు దంపతులకు కుమార్తెలు శ్రీలత(14), శిరీష, కుమారుడు రాజేందర్‌ ఉన్నారు. లోహితలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శ్రీలత పదోతరగతి, శిరీష ఆరోతరగతి, రాజేందర్‌ మూడోతరగతి చదువుతున్నారు.

శ్రీలత కాళ్లు చేతులు గుంజుతున్నాయని పాఠశాలకు వెళ్లనని అనడంతో.. బుధవారం ఉదయం పత్తికి ఎరువులు వేయడానికి వెళ్తూ తల్లి భద్రి కూతురును బడి వెళ్లమని మందలించింది. అనంతరం తల్లిదండ్రులు వ్యవసాయ బావి వద్దకు వెళ్లగా, తోబుట్టువులు శిరీష, రాజేందర్‌ బడికి వెళ్లిపోయారు. తల్లి మందలించిందనే మనస్తాపంతో శ్రీలత ఇంట్లోని సీలింగ్‌ ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పత్తికి ఎరువు వేసి ఇంటికి తిరిగొచ్చిన తల్లిదండ్రులు తలుపులు తెరిచి చూసేసరికి కూతురు విగతజీవిగా కనిపించింది. దీంతోవారు కన్నీటి పర్యంతమయ్యారు. మృతురాలి తల్లి భద్రి ఫిర్యాదు మేరకు శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఎంజీఎంకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వి.క్రాంతికుమార్‌ తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement