బిడ్డ కంట చెమ్మ.. గాయమైనా వచ్చింది అమ్మ..

షాద్‌నగర్‌టౌన్: రోడ్డు ప్రమాదంలో తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలియని 8 నెలల చిన్నారి ఆకలితో రోదిస్తోంది. విషయాన్ని గుర్తించిన ఆ తల్లి గాయాలను సైతం లెక్క చేయకుండా.. బిడ్డకు పాలిచ్చింది. ఈ దృశ్యం మంగళవారం షాద్‌నగర్ బైపాస్ జాతీయ రహదారిపై ఉన్న చటాన్‌పల్లి బ్రిడ్జి సమీపంలో కనిపించింది. దిశ హంతకుల ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని చూసేందుకు డ్రైవర్ లారీని అపుతుండగా.. అదే సమయంలో హైదరాబాద్ నుంచి కొత్తకోట వైపు వెళ్తున్న టాటా ఏస్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
కొత్తకోటకు చెందిన శాంతి టాటా ఏస్ వాహనంలో తన 8 నెలల కూతురితో ప్రయాణం చేస్తోంది. ఈ ప్రమాదంలో శాంతికి తీవ్ర గాయాలయ్యాయి. యాక్సిడెంట్ అయిన సమయంలో చిన్నారి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి ఆకలితో రోదించింది. దీంతో శాంతి రోడ్డు పక్కనే పడుకొని బిడ్డకు పాలిచ్చి ఆకలి తీర్చింది. ఘటనా స్థలంలో ఉన్న మీడియా ప్రతినిధులు రోడ్డు ప్రమాదం జరిగిన విషయాన్ని గుర్తించి క్షతగాత్రులను బయటికి తీశారు. గాయపడిన వారిని పోలీసులు షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి