సమ్మె విరమించండి | stop the strike | Sakshi
Sakshi News home page

సమ్మె విరమించండి

May 9 2015 11:54 PM | Updated on Mar 28 2018 11:08 AM

ఆర్టీసీ సమ్మె విషయంలో చర్చలు జరుగుతున్నాయని, కార్మికుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, కార్మికులు సమ్మె విరమించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

ఆర్టీసీ కార్మికులకు మంత్రి మహేందర్‌రెడ్డి వినతి
పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి

 
ఆదిబట్ల : ఆర్టీసీ సమ్మె విషయంలో చర్చలు జరుగుతున్నాయని, కార్మికుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, కార్మికులు సమ్మె విరమించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని తుర్కగూడ, కప్పాడు గ్రామాలలో శనివారం పలు అభివృధ్ది కార్యక్రమాలను మంత్రి మహేందర్‌రెడ్డి, భూవనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి ప్రారం భించారు. తుర్కగూడలో రూ.75 లక్షల జెడ్పీ నిధులతో నిర్మించిన నూతన డ్వా క్రా భవననాన్ని మంత్రి ప్రారంభించారు.

అనంతరం కప్పాడు నుంచి ఎలి మినేడు గ్రామానికి వేసిన బీటి రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ కార్మికుల సమస్య ల పరిష్కారానికి సబ్ కమిటీ నివేదిక రా గానే పరిశీలిస్తామన్నారు. కొత్త రాష్ట్రం లో దాదాపు రూ.150 కోట్లతో కొత్తగా బస్సులు కనుగోలు చేశామన్నారు. సమ్మెతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం మార్కెట్ యార్డును రూ.కోటి 50 లక్షలతో, తుర్కగూడలో రూ.75 లక్షల వ్యయంతో, కప్పాడులో రూ.80 లక్షలతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించామన్నారు.

కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎంపీపీ అశోక్‌గౌడ్, జెడ్పీటీసీ అయిలయ్య, తహసీల్దార్ ఉపేందర్‌రెడ్డి, ఎంపీడీఓ అనిల్‌కుమార్, తుర్కగూడ, కప్పాడు గ్రామాల సర్పంచ్‌లు ప్రభాకర్‌రెడ్డి, కరుణభారత్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు నిరంజన్‌రెడ్డి, రాందాస్‌పల్లి, ఆదిబట్ల, కొంగరకలాన్, ఎలిమినేడు సర్పంచ్‌లు శ్రీనివాస్‌రెడ్డి, రాజు, శేఖర్, యాదమ్మ, నాయకులు సత్తు వెంకటరమణారెడ్డి, లచ్చిరెడ్డి, జయేందర్‌రెడ్డి, కిరణ్ పాల్గొన్నారు.

బయటపడ్డ విభేదాలు..
 తుర్కగూడ గ్రామంలో డ్వాక్రా భవనం ప్రారంభోత్సావానికి వచ్చిన మంత్రి మహేందర్‌రెడ్డి ఎదురుగానే తుర్కగూడ సర్పంచ్ ప్రభాకర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యు డు నిరంజన్‌రెడ్డి మధ్య వాగ్వాదం చో టుచేసుకుంది. గ్రామంలో టీఆర్‌ఎస్ జెండాను తమకు చెప్పకుండా ఎలా ఎ గురవేస్తారని ఎంపీటీసీ సభ్యుడు నిరంజన్‌రెడ్డిని సర్పంచ్ ప్రభాకర్‌రెడ్డి నిలదీ శారు. పార్టీ జెండాను గతంలోనే ఎగురవేశామని, గ్రూపు రాజకీయాలతో కార్యకర్తల సమన్వయాన్ని దెబ్బతీయడం సరికాదని సర్పంచ్ ప్రభాకర్‌రెడ్డి అన్నా రు. టీఆర్‌ఎస్ నాయకులు ఇద్దరికి సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement