స్వైన్‌ఫ్లూతో మరో ముగ్గురి మృతి | States for another three killed | Sakshi
Sakshi News home page

స్వైన్‌ఫ్లూతో మరో ముగ్గురి మృతి

Jan 29 2015 1:00 AM | Updated on Sep 2 2017 8:25 PM

స్వైన్‌ఫ్లూ చికిత్సపొందుతున్న కిషన్‌బాగ్‌కు చెందిన సఫియాబి(60) బుధవారం ఉస్మానియా ఆస్పత్రిలో మృతి చెందింది.

సాక్షి, హైదరాబాద్: స్వైన్‌ఫ్లూ చికిత్సపొందుతున్న కిషన్‌బాగ్‌కు చెందిన సఫియాబి(60) బుధవారం ఉస్మానియా ఆస్పత్రిలో మృతి చెందింది. గాంధీ జనరల్ ఆస్పత్రిలో గత రెండు రోజుల నుంచి చికిత్స పొందుతున్న నార్త్‌లాలాగూడకు చెందిన ఐలమ్మ(80) మంగళవారం రాత్రి మృతి చెందింది. అలాగే నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం ఎర్రచెర్వుతండాకు చెందిన రమావత్ అనసూర్య(33) స్వైన్‌ఫ్లూతో గాంధీలో చేరి బుధవారం మృతిచెందింది. దీంతో కే వ లం నెల రోజుల్లో ఫ్లూతో చనిపోయిన వారి సంఖ్య 28కు చేరింది. కాగా, గాంధీ అవుట్‌పేషెంట్ విభాగంలో స్వైన్‌ఫ్లూ వార్డును ఆస్పత్రి సూపరింటెండెంట్ దెర్యవాన్ బుధవారం ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement