
శ్రీశ్రీ విగ్రహం
సాక్షి, హైదరాబాద్ : ట్యాంక్‌బండ్‌పై ఉన్న మహనీయుల విగ్రహాల పరిరక్షణలో అధికారుల నిర్లక్ష్యంపై ఓ పత్రికలో వచ్చిన ఫొటో వార్తపై హై కోర్టు స్పందించింది. ట్యాంక్‌బండ్‌పై ఉన్న ప్రముఖ కవి శ్రీశ్రీ విగ్రహం కూలిపోయే దశలో ఉన్న విషయాన్ని ఆ పత్రిక ఫొటో రూపంలో వార్త ఇచ్చింది. కథనాన్ని చూసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు పిల్‌గా పరిగణించి, తగిన ఆదేశాలు జారీ చేసే విషయంలో నిర్ణయం నిమిత్తం పిల్ కమిటీ ముందు ఉంచాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు.
రిజిస్ట్రీ ఫొటో కథనాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ ముందు ఉంచింది. కథనాన్ని పరిశీలించిన ఆయన దానిని సుమోటో పిల్‌గా పరిగణించాలంటా ఆదేశాలిచ్చారు. ఇందులో పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌లను ప్రతివాదులుగా చేర్చా రు. ఈ వ్యాజ్యంపై మంగళవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది.