వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు | Special trains in different routes | Sakshi
Sakshi News home page

వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు

Jan 21 2018 3:24 AM | Updated on Sep 4 2018 5:07 PM

Special trains in different routes - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రద్దీ దృష్ట్యా పలు మార్గా ల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్‌ తెలిపారు. సికింద్రాబాద్‌–రెక్సాల్‌ (07091/ 07092) ప్రత్యేక రైలు ఏప్రిల్‌ 3, 10, 17, 24, మే 1, 8, 15, 22, 29, జూన్‌ 5, 12, 19, 26 తేదీల్లో (మంగళవారం) రాత్రి 9.40 గంటల కు సికింద్రాబాద్‌లో బయలుదేరి గురువారం సాయంత్రం 6.15 గంటలకు రెక్సాల్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఏప్రిల్‌ 6, 13, 20, 27, మే 4, 11, 18, 25, జూన్‌ 1, 8, 15, 22, 29 తేదీల్లో (శుక్రవారం) మధ్యా హ్నం 12.45 గంటలకు రెక్సాల్‌లో బయలుదేరి ఆదివారం ఉదయం 6.55 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

కాచిగూడ– టాటానగర్‌ (07438/ 07439)ప్రత్యేక రైలు ఫిబ్రవరి 5, 12, 19, 26, మార్చి 5, 12, 19, 26, ఏప్రిల్‌ 2, 9, 16, 23, 30, మే 7, 14, 21, 28, జూన్‌ 4, 11, 18, 25 తేదీల్లో మధ్యా హ్నం ఒంటిగంటకు కాచిగూడలో బయలుదే రి మరుసటి రోజు సాయంత్రం 7.45 గంటల కు టాటానగర్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఫిబ్రవరి 6, 13, 20, 27, మార్చి 6, 13, 20, 27 ఏప్రిల్‌ 3, 10, 17, 24, మే 1, 8, 15, 22, 29 జూన్‌ 5, 12, 19, 26 తేదీల్లో రాత్రి 10.50 గంటలకు టాటానగ ర్‌లో బయలుదేరి రెండవ రోజు ఉదయం 5 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.

హైద రాబాద్‌–జైపూర్‌ (02731/ 02732) ప్రత్యేక రైలు మార్చి 2, 9, 16, 23, 30, ఏప్రిల్‌ 6, 13, 20, 27, మే 4, 11, 18, 25, జూన్‌ 1, 8, 15, 22, 29 తేదీల్లో సాయంత్రం 4.25 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి ఆదివారం ఉదయం 6.25కు జైపూర్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మార్చి 4, 11, 18, 25, ఏప్రిల్‌ 1, 8, 15, 22, 29 మే 6, 13, 20, 27, జూన్‌ 3, 10, 17, 24, జూలై 1 తేదీల్లో మధ్యాహ్నం 2.35కు జైపూర్‌లో బయలుదేరి మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement