వరుసగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల దృష్ట్యా ప్రతి జిల్లాకు ఓ ఐఏఎస్ అధికారిని స్పెషలాఫీసర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పది మంది ఐఏఎస్‌లకు బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: వరుసగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల దృష్ట్యా ప్రతి జిల్లాకు ఓ ఐఏఎస్ అధికారిని స్పెషలాఫీసర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించడంతో పాటు అవసరమైన సహాయక చర్యలను సమీక్షించే బాధ్యతలను వీరికి అప్పగించింది.
ఆదిలాబాద్ జిల్లాకు వికాస్‌రాజ్, ఖమ్మం జిల్లాకు అహ్మద్ నదీమ్, వరంగల్‌కు అరవింద్‌కుమార్, నల్లగొండకు చిరంజీవులు, మహబూబ్‌నగర్‌కు ఎం.జగదీశ్వర్, మెదక్‌కు రజత్‌కుమార్, నిజామాబాద్‌కు జి.అశోక్‌కుమార్, కరీంనగర్‌కు బీఆర్ మీనా, రంగారెడ్డి జిల్లాకు సురేశ్ చందా, హైదరాబాద్‌కు రాజేశ్వర్ తివారీని స్పెషలాఫీసర్లుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో పర్యటించి వర్షాలు, వరద నష్టాలపై నివేదికలు అందించాలని ఆదేశించారు. కేంద్రానికి నివేదిక పంపించేందుకు వీలుగా వరద నష్టం అంచనాలు, నివేదికల తయారీకి సమాచారం సేకరించాలని, సమన్వయంతో పని చేయాలని సూచించారు.