గుప్తనిధుల కోసం తవ్వకాలు | some persons committed to digs to treasure | Sakshi
Sakshi News home page

గుప్తనిధుల కోసం తవ్వకాలు

Mar 13 2015 11:14 PM | Updated on Mar 28 2018 11:08 AM

గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన సంఘటన మండలంలోని రుద్రారం గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.

రంగారెడ్డి: గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన సంఘటన మండలంలోని రుద్రారం గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. అదే గ్రామానికి చెందిన జెట్టని కుమార్ ఇంట్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపి ఓ వృద్ధురాలిని బలి ఇచ్చినట్లు తెలిసింది. అయితే రెండు రోజులుగా ఇంట్లో పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, గుమ్మడికాయలు కొట్టి జరిపినట్లు తెలిసింది. గుర్తుతెలియని ఓ వృద్ధురాలిని బలి ఇచ్చి అందులో పాతిపెట్టినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. జెట్టని కుమార్‌తోపాటు ఆరుగురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐలు శ్రీధర్‌రెడ్డి, చంద్రకాంత్ తెలిపారు. శనివారం ఉదయం గ్రామానికి వెళ్లి తవ్వకాలు జరుపుతామని చెప్పారు.
(షాబాద్)

Advertisement
 
Advertisement
Advertisement