మధుసూదనాచారిపై సోషల్‌ మీడియాలో సెటైర్లు

Social Media Slams On Madhusudhana Chary Milk Bath - Sakshi

సాక్షి​, హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారిపై సోషల్‌మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. తాజాగా ఆయన పాలాభిషేకం వీడియో ఒకటి నెట్‌లో వైరల్‌ అయిన విషయం తెలిసిందే.  ప్రజాప్రతినిధి అయివుండి ఇలాంటి పనులను ప్రొత్సహించటమేంటని విమర్శలు గుప్పిస్తున్నారు.

‘పాలను వృధా చేశారు. తెలంగాణలో కనీసం వాటిని కొనలేని ప్రజలు ఉన్నారని గుర్తించండి’ అని కొందరు.. ‘సాధారణంగా సినిమా వాళ్లకు కటౌట్లకు ఇలాంటి పాలాభిషేకం చూస్తుంటాం. కానీ, ఇప్పుడది వేరే మలుపు తీసుకున్నట్లుంది’ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరైతే ఓ మెట్టుదిగి ఆయనపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణలో కొత్తగా గ్రామపంచాయతీలు ఏర్పాటుచేసినందుకు కృతజ్ఞతగా తన నియోజకవర్గం భూపాలపల్లిలోని పెద్దపల్లి గ్రామంలో అనుచరులు మధుసూదనాచారికి  పాలాభిషేకం చేసిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top