తెలంగాణ స్పీకర్‌కు పాలాభిషేకం.. వైరల్‌ | Milk poured on Telangana Assembly Speaker Madhusudhana Chary | Sakshi
Sakshi News home page

తెలంగాణ స్పీకర్‌కు పాలాభిషేకం.. వైరల్‌

Apr 1 2018 7:09 PM | Updated on Apr 1 2018 7:56 PM

Milk poured on Telangana Assembly Speaker Madhusudhana Chary - Sakshi

సాక్షి, భూపాలపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్‌ కటౌట్లకు, ఫొటోలకు ఆయన అభిమానులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అప్పుడప్పుడు పాలాభిషేకాలు చేయడం చూశాం. ఇప్పుడు ఏకంగా అసెంబ్లీ స్పీకర్‌ ఎస్‌ మధుసూదనాచారికి ఆయన అభిమానులు పాలాభిషేకం చేశారు. ఆయనను మధ్యలో కూర్చోబెట్టి.. నిండు బిందె పాలతో ఆయనను తడిపేశారు. పెద్దపల్లి జిల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగింది.

నూతన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా పెద్దపల్లిలో స్పీకర్‌ మధుసూదనాచారికి ఆయన అభిమానులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆయనను మొదట శాలువతో సత్కరించారు. అనంతరం తమ అభిమానం చాటుకుంటూ.. ఒక బిందె పాలను ఆయనపై గుమ్మరించారు. ఈ పాలాభిషేకంతో స్పీకర్‌ తడిసిముద్దయ్యారు. తమ గ్రామంలో కొత్త గ్రామపంచాయతీ కార్యాలయం ప్రారంభమైన ఆనందంలో అభిమానులు స్పీకర్‌కు పాలాభిషేకం చేసినట్టు తెలుస్తోంది. ఈ పాలాభిషేకానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement