
కేసీఆర్ అదనపు కార్యదర్శిగా స్మితా సబర్వాల్
మెదక్ జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ ను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి పేషీలో అదనపు కార్యదర్శిగా ఆమెను నియమించారు.
హైదరాబాద్: మెదక్ జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ ను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి పేషీలో అదనపు కార్యదర్శిగా ఆమెను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు సీసీఎల్ఏగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
గజ్వేల్ సభలో స్మితా సబర్వాల్ పై సీఎం కేసీఆర్ ప్రశంసలు కురిపించిన మరునాడే ఆమె బదిలీ కావడం విశేషం. మెదక్ జిల్లా కలెక్టర్ గా స్మితా సబర్వాల్ వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు నవ్యరీతిలో ముందుకెళ్లారు. 95 శాతం ఓటింగ్ సాధించిన గ్రామాలకు బహుమతులు ప్రకటించారు.