వాననీటిలో సీతమ్మ విగ్రహం | Sitamma Statue In the Rain Water | Sakshi
Sakshi News home page

వాననీటిలో సీతమ్మ విగ్రహం

Jul 9 2018 10:52 AM | Updated on Jul 9 2018 10:52 AM

Sitamma Statue In the Rain Water - Sakshi

సీతమ్మ విగ్రహం చుట్టూ చేరిన నీరు 

పర్ణశాల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాల రామాలయం ఆవరణలోని ఉన్న కుటీరంలో సీతమ్మ వారి విగ్రహం చుట్టూ వర్షపునీరు చేరింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆనాటి రామాయణ వనవాస దృశ్యాలతో ఏర్పాటు చేసిన విగ్రహాల చుట్టూ వర్షపు నీరు చేరడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అక్కడ ఉన్న డ్రెయిన్లలో కూడా మురుగు పేరుకుపోయిందని, దీని వల్లే నీరంతా ఇలా విగ్రహాల చుట్టూ వచ్చి చేరుతోందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement