హైడ్రా నిర్లక్ష్యం?! | HYDRAA Negligence Over Koti ENT Hospital Rain Water News Updates | Sakshi
Sakshi News home page

హైడ్రా నిర్లక్ష్యం?!

Jun 10 2026 12:00 PM | Updated on Jun 10 2026 12:13 PM

HYDRAA Negligence Over Koti ENT Hospital Rain Water News Updates

సాక్షి, హైదరాబాద్: నగరంలో అక్రమ కట్టడాల తొలగింపుతో పాటు వరద నియంత్రణ, డ్రైనేజీ వ్యవస్థల పర్యవేక్షణ లాంటి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోంది హైడ్రా (HYDRA). అయితే తాజాగా ఈ సంస్థపై నిర్లక్ష్యం ఆరోపణలు వెల్లువెత్తాయి. 

నిన్న(మంగళవారం సాయంత్రం) కురిసిన వానకు నగరం అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. కోటి ఈఎన్‌టీ ఆసుపత్రి ప్రాంగణంలోకి వరద నీరు చేరి, మురుగు నీటితో కలిసి పరిస్థితి తీవ్ర ఇబ్బందికరంగా మారింది. రోగులు, వారి సహాయకులు ఆ పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే..

ఈ సమస్యపై హైడ్రా అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని బాధితులు వాపోతున్నారు. తక్షణమే నీటిని తొలగించి పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావాలని వారు కోరుతున్నారు. ఇంత కీలకమైన నగర నిర్వహణ బాధ్యతలు ఉన్నప్పటికీ సమస్యపై వెంటనే స్పందన లేకపోవడంతో హైడ్రా తీరుపై అసంతృప్తి వ్యక్తమవుతోంది ఇప్పుడు. దీంతో ఈ విమర్శలపై హైడ్రా ఎలా స్పందిస్తుందో చూడాలి. 

హైడ్రా విధులు ఏంటంటే.. 

1. వరద నియంత్రణ & డ్రైనేజీ నిర్వహణ
భారీ వర్షాల సమయంలో నీరు నిల్వ కాకుండా చూడటం, డ్రైనేజీ వ్యవస్థను పర్యవేక్షించడం, వరద నీటిని తొలగించడం.

2. అక్రమ ఆక్రమణల తొలగింపు
చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములపై ఉన్న ఆక్రమణలను గుర్తించి తొలగించడం.

3. విపత్తుల నిర్వహణ (Disaster Response)
వరదలు, భవన కూల్చివేతలు, ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించి సహాయం చేయడం.

4. నగర ఆస్తుల రక్షణ
చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు వంటి ఆస్తులను పరిరక్షించడం.

5. సమన్వయం & రెస్క్యూ చర్యలు
జీహెచ్ఎంసీ, పోలీస్, ఫైర్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి రక్షణ చర్యలు చేపట్టడం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement