నిర్లక్ష్యం నీడన గ్రంథాలయం    

Shortage Of Facilities In The Library - Sakshi

    అభివృద్ధికి ఆమడదూరంలోనే విజ్ఞాన భాండాగారాలు

బీర్కూర్‌ :  గ్రంథాలయాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ప్రభుత్వం పైసా విదల్చకపోవడం.. పం చాయతీలు సెస్సు చెల్లించకపోవడంతో అభివృద్ధి కి ఆమడదూరంలోనే ఉండిపోతున్నాయి. సౌకర్యా లు మెరుగుపడకపోవడంతో పాఠకులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రంథాలయాల అభివృద్ధిని పాలకులు పట్టించుకోకపోవడంతో జిల్లాలోని దాదాపు అన్ని చోట్ల సమస్యలు తిష్టవేశాయి. 

జిల్లాలో పరిస్థితి.. 

కామారెడ్డి జిల్లాకేంద్రంలోని జిల్లా గ్రంథాలయం తో పాటు జిల్లావ్యాప్తంగా 18 శాఖ గ్రంథాలయా లు, 9 గ్రామీణ గ్రంథాలయాలు, 16 పుస్తక నిక్షేప కేంద్రాలు ఉన్నాయి. 14 గ్రంథాలయాలకు మాత్ర మే సొంత భవనాలున్నాయి. మరో మూడు చోట్ల ఉచిత భవనాల్లో కొనసాగుతుండగా.. మిగిలినవి అద్దెభవనాల్లో నడుస్తున్నాయి. బీర్కూర్, మద్నూ ర్‌ తదితర ప్రాంతాల్లోని గ్రంథాలయ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. 

జిల్లాలో రూ. 1.20 కోట్ల సెస్‌ బకాయిలు.. 

పంచాయతీ పన్నుల వసూలులో భాగంగా 8 శా తం గ్రంథాలయ సెస్సును ప్రజల నుంచి వసూ లు చేస్తారు. ఇలా వసూలు చేసిన సెస్సును పంచాయతీలు గ్రంథాలయాలకు చెల్లించాల్సి ఉంటుం ది. కానీ ఏడేళ్లుగా సర్పంచ్‌లు గ్రంథాలయ సెస్‌ చెల్లించడం లేదు. దీంతో బకాయిలు పేరుకుపోతున్నాయి.

జిల్లాలో రూ. 1.20 కోట్ల మేర గ్రంథాల య సెస్‌ పేరుకుపోయింది. ఈ సెస్‌ను పంచాయతీలు చెల్లిస్తే గ్రంథాలయాల అభివృద్ధికి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం సైతం గ్రంథాలయాల నిర్వహణకు ఒక్కపైసా కేటాయించడం లేదు. ఉద్యోగుల వేతనాలకు తప్ప నయా పైసా విడుదల చేయకపోవడంతో నిర్వహణ భారమవుతోందని గ్రంథపాలకులు పేర్కొంటున్నారు. 

జిల్లావ్యాప్తంగా ఏడుగురే ఉద్యోగులు..

జిల్లావ్యాప్తంగా గ్రంథాలయాల్లో ఒక గ్రేడ్‌–2 ఉద్యోగి, ముగ్గురు రికార్డు అసిస్టెంట్‌లు, మరో ముగ్గురు ఆఫీస్‌ సబార్డినేట్‌లు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో ఇద్దరు ఆఫీస్‌ సబార్డినేట్‌లు, ఒక లైబ్రేరియన్‌ ఉన్నారు.

రూ. 12 వేల ఫిక్స్‌డ్‌ వేతనం పొందే 15 మంది పార్ట్‌టైం సిబ్బంది పనిచేస్తున్నారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వీరు పోరాటం చేస్తున్నారు. వీరిలో కొందరి వయస్సు రిటైర్మెంట్‌కు సమీపించినా క్రమబద్ధీకరణ జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సిబ్బంది కొరతతో ఒక్కో ఉద్యోగిని రెండు, మూడు చోట్ల ఇన్‌చార్జి గ్రంథపాలకులుగా నియమించారు. సిబ్బంది కొరత సైతం గ్రంథాలయాల మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రస్థాయిలో బుక్‌ సెలెక్షన్‌ కమిటి ఏర్పాటు చేయకపోవడంతో కొత్త పుస్తకాల ఎంపిక జరగడం లేదు. దీంతో కొన్నేళ్లుగా కొత్తపుస్తకాలు గ్రంథాలయాలకు రావడం లేదు.

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం 

పంచాయితీ పాలకులు సెస్‌ చెల్లించడం లేదు. జిల్లా లో రూ. కోటీ 20 లక్షల సెస్‌ రావా ల్సి ఉంది. గ్రంథాలయాల్లో సిబ్బంది కొరత కూడా ఉంది. దీంతో ఒక్కో ఉద్యోగికి రెండు నుంచి మూడు చోట్ల బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. సిబ్బందిని నియమించాలని, సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి నివేదించాం. 

– సురేశ్‌బాబు, గ్రంథాలయ సంస్థ జిల్లా కార్యదర్శి, కామారెడ్డి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top