ప్రతీకారంతోనే కాల్పులు

Sensational aspects in remand report on the firing incident in Akkannapeta - Sakshi

అక్కన్నపేట కాల్పుల ఘటనకు సంబంధించి రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన అంశాలు 

తుపాకుల అదృశ్యంపై చిక్కువీడని ప్రశ్నలు ఎన్నో! 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపి న అక్కన్నపేట కాల్పుల ఘటనపై రిమాండ్‌ రిపో ర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. బాధితుడు గంగరాజు తనను అవమానించాడని, అతడిని చంపి ప్రతీకారం తీర్చుకోవాలన్న లక్ష్యంతోనే అతని ఇంటిపై ఏకే–47 లక్ష్యంగా కాల్పులు జరిపాడని రిపోర్టులో పేర్కొన్నారు. గంగరాజు ఫి ర్యాదుతో నిందితుడిపై ఐపీసీ 307, ఆయుధాల చట్టం సెక్షన్‌ 25 (1), 27 ప్రకారం కేసులు న మోదు చేశారు. అయితే తుపాకుల అదృశ్యం పై రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్న అంశా లు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.  

రిపోర్టులో ఏముందంటే.. 
అక్కన్నపేట పోలీస్‌ స్టేషన్‌కు 500 మీటర్ల దూరంలో ఉండే గుంటి గంగరాజు, దేవుని సదానందంలు బంధువులు. ఈనెల 5న గంగరాజు తల్లి ఎల్లవ్వ, సదానందం భార్య కృష్ణవేణి.. సిమెంటు ఇటుకల విషయమై గొడవ పడ్డారు. ఇది తెలుసుకున్న గంగరాజు, అతని సో దరుడు అశోక్‌తో కలసి సదానందం ఇంటికి వెళ్లి నిలదీశారు. ఈ క్రమంలో సదానందం, అతని భార్య కృష్ణవేణి, ఆమె మేనమామ గుంటి వెంకట య్య.. గంగరాజు సోదరుల మధ్య వాగ్వాదం జరి గింది. ఈ క్రమంలో సదానందం ఫోన్‌ లాక్కున్న గంగరాజు..నీ భార్యని కూడా ఇలాగే లాక్కెళతా.. దిక్కున్నచోట చెప్పుకో! అని వెళ్లిపోయాడు. దీన్ని అవమానం గా భావించిన సదానం దం ఎలాగైనా గంగరాజు పై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. తాను గతంలో హుస్నాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో దొంగిలించిన ఏకే–47తో అతనిని మట్టుబెట్టాలనుకున్నాడు. ఆయుధాన్ని ఇంటి స మీపంలోని బస్వాపూర్‌ గుట్టల్లోకి తీసుకెళ్లి పనిచేస్తుందో లేదో సరిచూసుకున్నాడు. పనిచేయకపోవడంతో అక్కడే దానికి ఆయిల్‌ పోసి ఇంటికి తెచ్చాడు. అదేరోజు రాత్రి 9 గంటలకు తన ఇంటి వాకిట్లో కొన్ని రౌండ్లు కాల్చి పనిచేస్తుందని నిర్ధారించుకున్నాడు.

ఈ శబ్దాలు విని బయటికి వచ్చిన పొరుగింటి వ్యక్తి కేశబోయిన దిలీప్‌కు గంగరాజు ఇంటివైపు తుపాకీ తీసుకుని వెళ్తున్న సదానందం కన్పించాడు. అతను వెంటనే అశోక్‌కు ఫోన్‌ చేశాడు. దీంతో అప్రమత్తమైన బాధిత కుటుంబ సభ్యులు ఇంటికి గడియపెట్టారు. ఇంటికి తలుపులు పెట్టి ఉండటంతో సదానందం తెరిచి ఉన్న కిటికీ నుంచి గంగరాజును లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాడు. అంతా నేలపై పడుకోవడంతో అవి గురితప్పాయి. ఈలోగా ఇరుగుపొరుగు రావడంతో సదానందం అక్కడ నుంచి గోడదూకి పారిపోయాడు. రాత్రంతా పక్కనే ఉన్న బొడిగేపల్లిలోని ఓ చింతచెట్టుకింద తలదాచుకున్నాడు. మర్నాడు ఉదయం కోహెడ్‌ బస్టాప్‌కు లిఫ్ట్‌ అడిగి వెళ్లాడు. అక్కడ చేతిలో సంచితో అనుమానాస్పదంగా ఉన్న సదానందంను పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి ఏకే 47 రైఫిల్‌ బట్‌ నం కేఆర్‌ 85. ఆర్సెనెల్‌ నం. ఏఎన్‌ 0815.. 25 లై వ్‌ రౌండ్లు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ నుంచి స్టేషన్‌కు తరలించారు. అతడిచ్చిన సమాచారం తో ఇంట్లో ప్లాస్టిక్‌ పైపులో దాచిన కార్బన్‌ వెపన్‌ బట్‌ నం. కేఆర్‌ 122, ఆర్సెనల్‌ నం.16077508 గా గుర్తించారు. 

విచారణలో ఏం చెప్పాడంటే..: 2014లో మొదటి భార్యతో విడిపోయాక సదానందం రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇందుకు కృష్ణవేణికి రూ.2 లక్షల క న్యాశుల్కం చెల్లించాడు. ఇందులో రూ.లక్ష   నగ దును అధిక వడ్డీకి ఆశపడి కృష్ణవేణి బంధువైన గొట్టె కొమురవ్వకు అప్పుగా ఇచ్చారు. ఆమె బాకీని తిరిగి ఇవ్వకపోవటంతో 2016లో హుస్నాబాద్‌ ఠాణాలో ఆమెపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు అప్పు పత్రం అడిగారు. దీంతో సదానందం నకిలీ పత్రం సృష్టించి తీసుకొచ్చాడు. అసలు పత్రంతో కొమురవ్వ స్టేషన్‌కి వచ్చింది. ఇద్దరూ స్టేషన్‌ నుంచి బయటికి వచ్చిన క్రమంలో కొమురవ్వ వద్ద అప్పు అసలు పత్రం, రూ.లక్ష నగదు ఉన్న సంచిని దొంగిలించాడని ఆరోపిస్తూ ఆమె తన బంధువులతో కలసి సదానందంను అతని ఇంటిలోనే చితకబాదింది. దీంతో వీరిపై ఫిర్యాదు చేసేందుకు హుస్నాబాద్‌ ఠాణాకు సదానందం వెళ్లాడు. అప్పుడే.. తనపై దాడి చేసిన వారిపై పగ తీర్చుకునే ఉద్దేశంతో ఠాణా నుంచి తుపాకులను దొంగిలించాడు. కానీ, కృష్ణవేణి జోక్యంతో కొమురవ్వ డబ్బులివ్వడంతో వివాదం సమసిపోయింది. అయితే, అప్పటి నుంచి ఆ తుపాకులను తన వద్దే పెట్టుకున్నాడు.

ఈ ప్రశ్నలకు బదులేది..?  
ఆయుధాల అదృశ్యం కేసులో పోలీసుల తీరు ఆది నుంచి వివాదాస్పదంగానే ఉంది. ఏకే–47 వెపన్, 30 లైవ్‌రౌండ్లు మిస్సయినా.. పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయారు. దాన్ని కనిపెట్టేందుకు సరిగా దర్యాప్తు చేయకపోవడం కూడా గమనార్హం. 
- రిమాండ్‌ రిపోర్టులో వెపన్‌ ఏ తేదీన మిస్సయిన సంగతి ఎందుకు వెల్లడించలేదు?
9 ఎంఎం కార్బన్‌ కూడా తన వద్దే ఉందని నాలుగేళ్ల తరువాత సదానందం చెబితేగానీ పోలీసులు తెలుసుకోలేకపోయారు. 
ఇంతకాలం కార్బన్‌ వెపన్‌ ఉందని రికార్డుల్లో ఎలా చూపారు? 
సిద్ధిపేట కమిషనరేట్‌లో హుస్నాబాద్‌ ఠాణా విలీనం అవుతున్న సమయంలో ఆయుధాల లెక్కింపు జరిగింది. ఏకే–47 రైఫిల్‌ మిస్సయిన విషయాన్ని గుర్తించిన అధికారులు కార్బన్‌ పిస్టల్‌ విషయం ఎందుకు గుర్తించలేక పోయారు? అంటే హుస్నాబాద్‌ సిబ్బంది అందుబాటులో ఉన్న కార్బన్‌ను రెండుసార్లు లెక్క చూపించారా? 
కార్బన్‌వెపన్‌ మిస్సింగ్‌పై పోలీసులు ఇప్పటికీ ఎఫ్‌.ఐ.ఆర్‌ ఎందుకు నమోదు చేయడం లేదు? 
కార్బన్‌వెపన్‌ మిస్సింగ్‌ విషయాన్ని కమిషనరేట్‌ అధికారులకు తెలియనివ్వకుండా నాలుగేళ్లపాటు ఎలా కప్పిపుచ్చగలిగారు? 
ఏకే–47 వెపన్‌ పోయినందుకు నరేందర్‌ అనే కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకున్న అధికారులు కార్బన్‌ వెపన్‌ మాయం విషయంలో ఎవరిపైనా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top