సత్ఫలితాలిస్తున్న ‘సీడ్‌ బాల్స్‌’

seed balls gives good results says forest officers - Sakshi

10 వేలకు 6 వేల టేకు మొక్కలు సజీవం

కెరమెరి : గతేడాది విత్తన బంతుల ద్వారా  నూతన ప్ర యోగానికి శ్రీకారం చుట్టిన అటవీ అధికారులు ప్రణా ళిక విజయవంతమవుతుంది. ప్లాస్టిక్‌ కవర్లలో స్టంపు పెట్టి వాటికి నీరు పోసి బతికించే దానికంటే మట్టితో వివిద రకాల వస్తువులు కలిపి తయారు చేసిన విత్తన బంతులు సీడ్‌ బాల్స్‌ తోనే అధిక ప్రయోజనం ఉం టుందని భావించిన అటవీ అధికారులు ఈ ఏడాది ప్రతి ష్టాత్మకంగా చేపట్టబోయే హరితహరంలో ఆ ప్రయోగాన్నే అధికంగా వాడనున్నారు. కెరమెరి అటవీ „ó క్షేత్రాధికారి పరిధిలో కెరమెరి, జైనూర్, సిర్పూర్‌(యు) మండలాలు ఉన్నాయి. కెరమెరిలో గతేడాది రేంజ్‌లోని కొప్పగూడలో 2 వేలు, గోయగాంలో 2 వేలు, సాంగ్వి లో 2 వేలు, ధోబోలిలో 2 వేలు, బిర్లఘాట్‌లో రెండు వే లు మొత్తం 10 వేల  విత్తన బంతులు విసరగా 6 వేలు ప్రస్తుతం సజీవంగా ఉన్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. 

రెండు వందల ఎకరాల్లో విత్తన బంతులు
కెరమెరి రేంజ్‌ మొత్తం 60 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అందులో విత్తన బంతులు గత సంవత్సరం 200 ఎకరాల్లో విసరారు. ఆ బంతులన్ని అటవీ ప్రాంతంలో విసరడం తో పాటు అధికారులు అటువైపుగా పశువులు మేపకుండా చర్యలు తీసుకోవడంతో ఆ మొక్కలు సజీ వంగా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం అయితే ఈ సంవత్సరం 25 వేల విత్తన బంతులను వేయాలని అటవీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రేంజ్‌లోని అన్ని మండలాల్లో నర్సరీ పనులు ప్రారంభమైయ్యాయి. 

లక్ష్యం 5 లక్షల మొక్కలు
గతేడాది కెరమెరి, జైనూర్, సిర్పూర్‌(యు) మండలాల్లో  అటవీ అధికారులకు మూడు  లక్షల   మొక్కలు నాటా రు. ఈ సంవత్సరం ఐదు లక్షల మొక్కలను నాటాలని అధికారులు ఆదేశించారు.. అందులో మూడు మండలాల్లోని  సాంగ్వి,  కెరమెరి, దుబ్బగూడ, కోహినూర్, రాసిమొట్టల్లో  5 లక్ష్యల మొక్కలను నాటనున్నారు. ఒక్కో నర్సరీలో లక్ష మొక్కలను నాటనున్నారు.  అయి తే అధికారుల కొరతతో చాలా ఇబ్బంది పడుతున్నారు. 25 మంది అటవీ సిబ్బంది ఉండాల్సి ఉండగా ఎప్‌ ఎస్‌వోలు ఐదుగురు, ఎఫ్‌బీవోలు ఐదుగురు మాత్రమే  ఉన్నారు. 

పండ్ల మొక్కలకు ప్రాధాన్యం
మా నర్సరీల్లో వివిధ రకాల పూలు, పండ్ల మొక్కల కు అధిక ప్రాధాన్యం ఇస్తాం. గతేడాది కూడా వివిద రకాల పూలు, పండ్ల మొక్కలను నర్సరీల్లో పెంచాం. ఈ ఏడాది హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తాం. వివిద రకాల మొక్కలను అందుబాటులో ఉంచుతాం.                                                 
            – సయ్యద్‌ మజరుద్దీన్, ఎఫ్‌ఆర్వో, కెరమెరి
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top