
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. గురువారం నుంచి వివిధ శాఖలను తరలించనున్నారు.మొదటగా ఆర్ అండ్ బీ శాఖ తరలి వెళ్లనుంది.లాంఛనంగా బుధవారం ఆర్‌అండ్‌బీ కార్యాలయానికి రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ వెళ్లారు.గురువారం నుంచి అక్కడికే రావాలని సిబ్బందికి ఆదేశాలు చేశారు.ఈ కార్యాలయంలోనే మంత్రి ప్రశాంత్‌రెడ్డి పేషీ ఉంది. ముందుగా మంత్రుల ఛాంబర్లను తరలించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రెండు, మూడు రోజుల్లో మంత్రుల ఛాంబర్లు తరలిపోనున్నాయి.