
కొడంగల్ ( వికారాబాద్) : పట్టణంలో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కురిసిన వర్షానికి స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల భవనం కూలిపోయింది. 150 మంది విద్యార్థులు చదువుతున్న ఈ పాఠశాలలో గదుల కొరత ఉంది. భవనం కూలిపోయిన సమయంలో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.