గుండ్లపొట్లపల్లి సర్పంచ్‌కు అరుదైన గౌరవం  

Sarpanch From Gundla Pottapalli Taking Prize By The Hands Of Prime Minister On Gandhi Jayanti - Sakshi

సాక్షి, జడ్చర్ల : సర్పంచ్‌గా ఎన్నికైనప్పటి నుంచి గ్రామాభివృద్ధి కోసం అహర్నిషలు కృషిచేస్తూ.. వందశాతం ఓడీఎస్‌తోపాటు వందశాతం ఇంటింటికీ ఇంకుడు గుంతలు పూర్తి చేసినందుకు గాంధీ జయంతి, స్వచ్ఛ భారత్‌ దివస్‌ 2019కి సందర్బంగా గుండ్లపొట్లపల్లి సర్పంచ్‌ రాఘవేందర్‌రెడ్డి ఈ నెల 30న, అక్టోబర్‌ 1, 2 తేదీల్లో అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమంలో ప్రధాని మోదీ చేతులమీదుగా అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు. కార్యక్రమానికి దేశంలో గ్రామాభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తున్న 240 మందికి ఆహ్వానం అందగా.. రాష్ట్ర నుంచి 12 మంది సర్పంచ్‌లు ఉన్నారు. ఇందులో మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి గుండ్లపొట్లపల్లి సర్పంచ్‌ రాఘవేందర్‌రెడ్డికి అవకాశం ద క్కింది. అంతేకాకుండా ఈ నెల 25న ఢిల్లీలో డాక్టర్‌ శ్యాంప్రసాద్‌ముఖర్జీ జాతీయ ఎక్సలెన్సీ అవార్డును సైతం అందుకోవాలని సోమ వారం ఢిల్లీలోని చాణక్య ఫౌండేషన్‌ స్వ చ్ఛ భారత్‌ అభియాన్‌ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఆహ్వనం అందింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top