ఎలుకలమందు తాగి సేల్స్ ఎగ్జిక్యూటివ్ మృతి | Sales Executive commits suicide | Sakshi
Sakshi News home page

ఎలుకలమందు తాగి సేల్స్ ఎగ్జిక్యూటివ్ మృతి

Aug 21 2015 6:21 PM | Updated on Nov 6 2018 7:56 PM

ఎలుకల మందు తాగి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

మలక్‌పేట (హైదరాబాద్) : ఎలుకల మందు తాగి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రంజిత్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ముషీరాబాద్‌కు చెందిన జోసఫ్ (37) సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. కాగా శుక్రవారం ముసారంబాగ్‌లోని బంధువుల ఇంటికి వచ్చాడు. వచ్చిన కొద్దిసేపటికే స్పృహ తప్పి కిందపడిపోయాడు.

అతడు విషం తాగి ఉన్నట్లు గమనించిన బంధువులు హూటాహూటిన మలక్‌పేటలోని యశోద ఆసుపత్రి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా విషం తాగడానికి గల కారణాలు తెలియాల్సి ఉండగా మృతునికి భార్య, కూతురు ఉన్నారు. పని చేస్తున్న సంస్థ యాజమాన్యం ఒత్తిడి వలనే విషం తాగాడని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement