
పాలకూర జగన్ (ఫైల్)
దిల్‌సుఖ్‌నగర్: అనారోగ్యంతో సీనియర్ విలేకరి పాలకూర జగన్(జంగయ్య) బుధవారం రాత్రి మృతి చెందాడు. సాక్షి దినపత్రికలో పది సంవత్సరాలుగా సైదాబాద్ కంట్రిబ్యూటర్‌గా పనిచేస్తున్నారు. ఇతనికి భార్య, కుమారుడు ఉన్నారు. జగన్ స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం. జగన్ మృతి పట్ల మలక్‌పేట నియోజకవర్గ ఎమ్మెల్యే అహ్మద్ బలాల, కార్పొరేటర్లు స్వర్ణలత రెడ్డి, సామ స్వప్నరెడ్డిలతో పాటు వివిధ పార్టీల నేతలు, జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు.