నాభర్తపై టీఆర్‌ఎస్‌ కక్ష కట్టింది : సబిత

Sabitha Komatireddy Fire On TRS Govt - Sakshi

నల్లగొండ : తన భర్త కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కక్ష కట్టిందని మాజీ మంత్రి, నల్లగొండ కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సతీమణి  కోమటిరెడ్డి సబిత అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా  శుక్రవారం పట్టణంలోని 9, 21వ వార్డుల్లో ఆమె విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఎవరూ చేయని విధంగా తన భర్త తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేయడంతోపాటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని కాంగ్రెస్‌ అధిష్టానాన్ని ఒప్పించేందుకు నిరాహార దీక్ష చేశారని గుర్తు చేశారు. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన కోమటిరెడ్డిని ఎమ్మెల్యే పదవి నుంచి కూడా కక్షకట్టి సస్పెండ్‌ చేశారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ప్రజలు ప్రశాంతంగా ఎలాంటి అల్లర్లు లేకుండా ఉండాలంటే కోమటిరెడ్డికి మరోసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆమెవెంట బుర్రి శ్రీని వాస్‌రెడ్డి, శ్వేత, బుర్రి చైతన్య, సరస్వతి, నాగమణి, సరోజ, సరిత, శ్రీలత, పల్లె రవీందర్‌రెడ్డి, గాడిగ శ్రీనివాస్, గాదె శ్రీనివాస్‌రెడ్డి, వంగాల అనిల్‌రెడ్డి, లింగస్వామి, జానయ్య, సోమయ్య, నాగరాజు,వెంకటేశ్వర్లు,రవి తదితరులు ఉన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top