కొనసాగుతున్న ఆర్టీఏ తనిఖీలు | RTA seized 4 bus in Hyderabad | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న ఆర్టీఏ తనిఖీలు

Jan 13 2015 8:57 AM | Updated on Sep 4 2018 5:07 PM

ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ అధికారులు మరోసారి కొరడా ఝళిపించారు.

హైదరాబాద్: ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ అధికారులు మరోసారి కొరడా ఝళిపించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేట్ బస్సులపై దాడులు నిర్వహించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణ చార్జీలు అధికంగా వసూళ్లు చేయడంతో పాటు రవాణాశాఖ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారని ప్రైవేట్ ట్రావెల్స్లపై ఆర్టీఏ అధికారులు మళ్లీ దాడులు ప్రారంభించారు.

సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగర శివార్లలో ఆర్టీఏ తనిఖీలు కొనసాగుతున్నాయి.  నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 11 బస్సులపై కేసు నమోదు చేయగా, మరో 4 బస్సులను అధికారులు సీజ్ చేశారు. కేశినేని, ఎస్వీఆర్, కావేరి, మేఘన ట్రావెల్స్ బస్సులు సీజ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement