రూ.5 కోట్ల నగదు స్వాధీనం | Rs 5Cr ought in Election check post in Janagam | Sakshi
Sakshi News home page

రూ.5 కోట్ల నగదు స్వాధీనం

Dec 4 2018 9:06 AM | Updated on Dec 4 2018 8:26 PM

Rs 5Cr ought in Election check post in Janagam - Sakshi

సాక్షి, జనగామ : హైదరాబాద్-వరంగల్ హైవేపై పెద్ద ఎత్తున నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం అర్థరాత్రి 2 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న షిఫ్టు కారు(ఏపీ 37 సీకే 4985)ను తనిఖీ చేశారు. వెనక సీటు కింద నగదు కట్టలను పోలీసులు గుర్తించారు. జనగామ మండలంలోని పెంబర్తి ఎన్నికల చెక్ పోస్టు వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది.

కారులో తరలిస్తున్న డబ్బు దాదాపు రూ.5 కోట్లు వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పూర్తి స్థాయి నగదు వివరాలను వెల్లడించాల్సి ఉంది. స్థానిక పోలీస్టేషన్ లో ఎలక్షన్ కు సంబంధించిన అన్ని శాఖల అధికారుల సమక్షంలో యంత్రాల సహాయంతో డబ్బును లెక్కిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో భారీ మొత్తంలో నగదు లభ్యమవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


 



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement