breaking news
Pembarthi check post
-
రూ.5 కోట్ల నగదు స్వాధీనం
సాక్షి, జనగామ : హైదరాబాద్-వరంగల్ హైవేపై పెద్ద ఎత్తున నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం అర్థరాత్రి 2 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న షిఫ్టు కారు(ఏపీ 37 సీకే 4985)ను తనిఖీ చేశారు. వెనక సీటు కింద నగదు కట్టలను పోలీసులు గుర్తించారు. జనగామ మండలంలోని పెంబర్తి ఎన్నికల చెక్ పోస్టు వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. కారులో తరలిస్తున్న డబ్బు దాదాపు రూ.5 కోట్లు వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పూర్తి స్థాయి నగదు వివరాలను వెల్లడించాల్సి ఉంది. స్థానిక పోలీస్టేషన్ లో ఎలక్షన్ కు సంబంధించిన అన్ని శాఖల అధికారుల సమక్షంలో యంత్రాల సహాయంతో డబ్బును లెక్కిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో భారీ మొత్తంలో నగదు లభ్యమవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
పెంబర్తి చెక్‌పోస్టు వద్ద రూ. 8.38 లక్షలు సీజ్
జనగామ(వరంగల్): వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల నేపథ్యంలో జనగామ మండలం పెంబర్తి చెక్‌పోస్టు వద్ద బుధవారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారులో రూ.8.38 ల క్షల నగదు లభ్యమైంది. జనగామ సీఐ నర్సింహారావు ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ నుంచి ఎంహెచ్ 43ఎన్ 4439 నెంబరు గల కారులో ఓ మహిళ రూ.8.38 లక్షలను తీసుకెళ్తుండగా పట్టుకున్నారు. ఆ మహిళ అనుమానాస్పదంగా సమాధానం చెప్పడంతో కారు డ్రైవర్‌ను, మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.