పంటల పరిశీలన: జనగామలో రైతులను పరామర్శించిన కేసీఆర్‌ | Ex CM KCR Telangana Three Districts Tour Live Updates And Highlights In Telugu - Sakshi
Sakshi News home page

పంటల పరిశీలన: జనగామలో రైతులను పరామర్శించిన కేసీఆర్‌

Mar 31 2024 10:19 AM | Updated on Mar 31 2024 1:21 PM

Ex CM KCR Three Districts Tour Live Updates - Sakshi

ఎండిపోయిన పంటలను పరిశీలించేందుకు కేసీఆర్‌ క్షేత్రస్థాయిలో

Live Updates..

జనగామ జిల్లాలో కేసీఆర్‌ బస్సు తనిఖీ..
ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో కేసీఆర్‌ బస్సులో పోలీసుల తనిఖీలు
తనిఖీ అనంతరం మళ్లీ బయలుదేరిన కేసీఆర్‌. 

►జనగామ జిల్లాలో ఎండిన పంటపొలాలను పరిశీలించిన కేసీఆర్

  • అలాగే, రైతులను పరామర్శించిన కేసీఆర్‌
  • రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 
  • కాసేపట్లో తిరుమలగిరి మండల కేంద్రం చేరుకోనున్న కేసీఆర్ అటు నుంచి అర్వపల్లి మండలం వెలుగుపల్లిలో ఎండిన పంటల పరిశీల‌న 
  • అనంతరం, పంట నష్టంపై రైతులతో మాట్లాడనున్న కేసీఆర్
  • తిరుమలగిరి, అర్వపల్లిలో కేసీఆర్‌కు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణుల ఏర్పాట్లు

►జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధరావత్ తండాకు చేరుకున్న కేసీఆర్

►పంట పొలాలను పరిశీలించేందుకకు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటనకు బయలుదేరారు. ఎర్రవల్లి ఫామ్‌ హౌస్‌ నుంచి కేసీఆర్‌ జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పర్యటనకు బయలుదేరారు. 

►అయితే, రాష్ట్రంలో సాగునీరు అందక, భూగర్భ జలాలు అడుగంటడంతో ఎండిపోయిన పంటలను పరిశీలించేందుకు కేసీఆర్‌ క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఓ వైపు రాష్ట్రంలో కరువు పరిస్థితులు, మరోవైపు అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్లో ధైర్యం నింపడం లక్ష్యంగా కేసీఆర్ రైతులను కలవనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పంట పొలాలను పరిశీలించడంతోపాటు రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకుంటారు.

కేసీఆర్‌ పర్యటన ఇలా.. 
►ఈరోజు ఉదయం 10:30 గంటలకు చేరుకుని జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధరావత్‌ తండాకు చేరుకుని అక్కడ ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు. అనంతరం జనగామ, సూర్యాపేట మార్గంలో ప్రయాణించి 11:30 గంటలకు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, అర్వపల్లి, సూర్యాపేట రూరల్‌ మండలాల్లో ఎండిన పంట పొలాలను పరిశీలిస్తారు.

►మధ్యాహ్నం 1:30 గంటలకు సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు చేరుకుంటారు. అక్కడ రెండు గంటలకు భోజనం చేసి  మూడు గంటలకు మీడియాతో మాట్లాడతారు. మధ్యాహ్నం 3:30 గంటలకు సూర్యాపేట నుంచి బయలుదేరి 4.30కు నల్లగొండ జిల్లా నిడమనూరులో పంట పొలాలను పరిశీలిస్తారు. ప్రతీ చోటా రైతులతో ముఖాముఖి సంభాషిస్తారు. సాయంత్రం 6 గంటలకు నిడమనూరు నుంచి బయల్దేరి నల్లగొండ, నార్కట్‌పల్లి, చిట్యాల, భువనగిరి మీదుగా ఎర్రవెల్లి ఫాంహౌజ్‌కు రాత్రి 9 గంటలకు చేరుకుంటారు.    


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement