మద్యం దుకాణంలో భారీ దొంగతనం | robbery in wine shop at medak district | Sakshi
Sakshi News home page

మద్యం దుకాణంలో భారీ దొంగతనం

Jan 13 2016 3:43 PM | Updated on Aug 30 2018 5:27 PM

మద్యం దుకాణంలో భారీ దొంగతనం - Sakshi

మద్యం దుకాణంలో భారీ దొంగతనం

మద్యం దుకాణంలోనికి చోరబడిన దుండగులు పెద్ద మొత్తంలో మద్యం బాటిళ్లను ఎత్తుకుపోయారు.

మెదక్: మద్యం దుకాణంలోనికి చోరబడిన దుండగులు పెద్ద మొత్తంలో మద్యం బాటిళ్లను ఎత్తుకుపోయారు. ఈ ఘటన మెదక్ జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్ గ్రామంలో చోటుచేసుకుంది.

గ్రామ చౌరస్తా సమీపంలోని అమృత మద్యం దుకాణం నిర్వాహకులు మంగళవారం రాత్రి మద్యం షాపునకు తాళాలు వేసి వెళ్లిపోయారు. అర్థరాత్రి దాటిన తర్వాత గోడకు కన్నం పెట్టిన దొంగలు దుకాణంలోనికి ప్రవేశించి రూ.3 లక్షల విలువైన మద్యం బాటిళ్లను ఎత్తుకుపోయారు. బుధవారం ఉదయం స్థానికులు గమనించి దుకాణం నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. బాధితుని ఫిర్యాదు మేరకు తూప్రాన్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఎస్సై బాల్‌రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement