ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం ఆర్టీఏ ఆఫీసులోని క్యాష్ కౌంటర్‌లో భారీ చోరీ జరిగింది.
ఆర్టీఏ కార్యాలయంలో భారీ చోరీ
Nov 27 2015 1:22 PM | Updated on Aug 30 2018 5:27 PM
కొత్తగూడెం: ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం ఆర్టీఏ ఆఫీసులోని క్యాష్ కౌంటర్‌లో భారీ చోరీ జరిగింది. క్యాష్ కౌంటర్ లో ఉన్న రూ.80 వేల నగదును గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. క్యాష్ కౌంటర్ రూం కిటికీలు తొలగించి దొంగతనానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఆర్టీఏ ఆఫీసు సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తెలిసిన వాళ్లే చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా విచారణ చేపట్టారు.
Advertisement
Advertisement