గొంతుపై కత్తి పెట్టి దోపిడీ | Robbery in Alwal | Sakshi
Sakshi News home page

గొంతుపై కత్తి పెట్టి దోపిడీ

Aug 1 2015 7:37 PM | Updated on Aug 30 2018 5:27 PM

ఇద్దరు దుండగులు పట్టపగలే ఓ ఇంట్లోకి ప్రవేశించి మహిళ మెడపై కత్తి పెట్టి భారీ దోపిడీకి పాల్పడ్డారు.

అల్వాల్ (హైదరాబాద్) : ఇద్దరు దుండగులు పట్టపగలే ఓ ఇంట్లోకి ప్రవేశించి మహిళ మెడపై కత్తి పెట్టి భారీ దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన నగరంలోని అల్వాల్ సూర్యానగర్‌లో శనివారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పి.జయ(30) అనే మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఇద్దరు దుండగులు వచ్చి తలుపు తట్టారు.

ఆమె తలుపు తీసిన వెంటనే ఒక దుండగుడు మెడపై కత్తి పెట్టగా, మరో దుండగుడు బీరువాలో ఉన్న లక్ష నగదును, పుస్తెలతాడు సహా 20 తులాల బంగారు ఆభరణాలను దోచుకుని పరారయ్యారు. ఈ పరిణామంతో షాక్‌కు గురైన గృహిణి జయను స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement