‘ఇసుక’తో కేసీఆర్‌ కుటుంబానికి రోజుకో కోటి | Sakshi
Sakshi News home page

‘ఇసుక’తో కేసీఆర్‌ కుటుంబానికి రోజుకో కోటి

Published Tue, Jul 25 2017 1:53 AM

‘ఇసుక’తో కేసీఆర్‌ కుటుంబానికి రోజుకో కోటి - Sakshi

డ్రగ్స్‌ కేసులో కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేస్తాం: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్‌: ఇసుక అక్రమ వ్యాపారం ద్వారా కేసీఆర్‌ కుటుంబా నికి రోజుకు కోటి రూపాయలు ముడుపులుగా అందుతున్నాయని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సిరి సిల్లలో పోలీసుల దాడికి గురైన వారి కుటుంబసభ్యులు రేవంత్‌రెడ్డిని సోమవారం కలిశారు. ఆయన మాట్లాడుతూ ఇసుక క్వారీలు అన్నీ సీఎం కేసీఆర్‌ కుటుంబ సభ్యులకే ఎలా దక్కుతాయని ప్రశ్నించారు. వారి ఇసుక అక్రమ వ్యాపారాన్ని కాపాడుకోవడానికే ప్రశ్నించిన దళితులపై పోలీసులతో దాడి చేయించారని ఆరోపించారు. వీరికి న్యాయం చేయాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్‌పై ఉందన్నారు.

డ్రగ్స్, మాదకద్రవ్యాల కేసులో టీఆర్‌ఎస్‌ నేతలకు, సీఎం కేసీఆర్‌ కుటుంబసభ్యులకు అనుకూలంగా విచారణ జరుగుతున్నదని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మంత్రి కేటీఆర్‌ బావమరిదికి చెందిన పబ్, సీనియర్‌ మంత్రి కుమారుని పబ్‌ నిబంధనలకు విరు ద్ధంగా నడుస్తున్నాయని, ఈ విషయం సీఎం కేసీఆర్‌కు తెలియదా అని ప్రశ్నించారు. వీటిపై కేంద్ర హోంమంత్రికి, గవర్నర్‌కు ఫిర్యాదుచేస్తామని రేవంత్‌ హెచ్చరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement