రేవంత్‌ రోడ్‌షో  | Revanth Reddy Road Show In Kadthal | Sakshi
Sakshi News home page

రేవంత్‌ రోడ్‌షో 

Nov 18 2018 5:40 PM | Updated on Nov 18 2018 5:40 PM

Revanth Reddy Road Show In Kadthal - Sakshi

కడ్తాల్‌లో రేవంత్‌రెడ్డి రోడ్‌షోకు హాజరైన జనం, (ఇన్‌సెట్లో) అభివాదం చేస్తున్న రేవంత్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి

కడ్తాల్‌(కల్వకుర్తి): కడ్తాల్‌ మండల కేంద్రంలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎనుముల రేవంత్‌రెడ్డి శనివారం రోడ్‌షో నిర్వహించారు. కాంగ్రెస్, మహకూటమి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.   మైసిగండి, కర్కల్‌పహడ్, ఎక్వాయిపల్లి గేట్, వాస్‌దేవ్‌పూర్‌ గేట్‌ల వద్ద కార్యకర్లు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. కడ్తాల్‌ మండల  అంబేద్కర్‌ విగ్రహానికి కాంగ్రెస్‌ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డితో కలిసి పూలమాల వేశారు.

కాగా, రేవంత్‌రెడ్డి రోడ్‌ షోలో తలకొండపల్లి సింగిల్‌విండో చైర్మన్‌ గట్ల కేశవరెడ్డి, వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి దేవని సతీష్‌ మాదిగ, పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్, రేవంత్‌మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు ఆసీఫ్‌అలీ, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు చారకొండ వెంకటేశ్, సూదిని రాంరెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బీక్యానాయక్, ప్రచార కార్యదర్శి లక్ష్మీ నర్సింహారెడ్డి,  మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు యాట నర్సింహ, ఎంపీటీసీలు చేగూరి వెంకటేశ్, లక్ష్మయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement