రైతులు ఎండాకాలం పంటలు వేయడం మానుకోవాలి: రేవంత్‌ రెడ‍్డి | CM Revanth Reddy on EL nino situation in Telangana | Sakshi
Sakshi News home page

రైతులు ఎండాకాలం పంటలు వేయడం మానుకోవాలి: రేవంత్‌ రెడ‍్డి

Oct 15 2026 8:03 PM | Updated on Oct 15 2026 8:19 PM

CM Revanth Reddy on EL nino situation in Telangana

హైదరాబాద్: ఐక్యరాజ్యసమితి 100 దేశాల్లో ఎల్ నినో ప్రభావం ఉంటుందని ప్రకటించిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తీవ్ర నీటి ఎద్దడి, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఐరాస హెచ్చరిస్తోందని తెలిపారు. శాస్త్రవేత్తలు, వాతావరణ నిపుణులు పలు సూచనలు చేస్తున్నారని వివరించారు. నీటి, విద్యుత్ సమస్యలను ప్రజలు ఎదుర్కొబోతున్నారని తెలిపారు.

హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో గురువారం రాత్రి రేవంత్‌ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ఒక సీజన్‌ పంటను వాయిదా వేసుకోవాలి. కేంద్రానికి నివేదికలు పంపి సాయం అడుగుతాం. విద్యుత్‌తో పాటు నీటి అవసరాలు పెరుగుతున్నాయి. సాగు, తాగునీరు ఇవ్వలేని పరిస్థితులు. రాబోయే 10 నెలలు రాష్ట్రానికి అత్యంత కీలకం. ప్రజలను భాగస్వాములను చేస్తూ సమస్యలను అధిగమించాల్సి ఉంది. 

కొవిడ్‌తో ప్రపంచమే ‍స్తంభించింది... ఇప్పుడు అలాంటి పరిస్థితే మళ‍్లీ రాబోతుంది. 1950 తర్వాత చాలా సందర్భాలలో ఎల్‌ నినో రూపంలో కరువు వచ్చింది. ఇప్పుడు సూపర్ ఎల్ నినో వచ్చింది. దీన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. 

ప్రభుత్వం దీర్ఘకాలిక కార్యచరణ సిద్ధం చేసింది. ప్రతి ఒక్కరూ కార్యాచరణలో భాగం కావాలి. రైతులపై ఎల్ నినో తీవ్ర ప్రభావం పడింది. వర్షాలు తక్కువ పడడం వల్ల తీవ్ర విద్యుత్ సమస్య ఏర్పడుతుంది. ఇది పరిశ్రమలపై కూడా పడింది. వేసవి కాలం నుంచే ఎల్ నినోపై రైతులకు అవగాహన కల్పించాం. గత మూడు సంవత్సరాలలో అక్టోబర్‌లో 15 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండేది. కానీ ఈ సంవత్సరం 20 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చింది. ఎండాకాలం అక్టోబర్ నెలలోనే వచ్చింది. నీటి, విద్యుత్ సమస్యలను ప్రజలు ఎదుర్కొబోతున్నారు’’ అని చెప్పారు. 

ఇదీ చదవండి: ఒక్కరి కోసం సొంత దేశ ప్రజలతోనే మోదీ, షా యుద్ధం: దీప్కే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement