ఏసీబీ కార్యాలయానికి రేవంత్ తరలింపు | revanth reddy brought to ACB office | Sakshi
Sakshi News home page

ఏసీబీ కార్యాలయానికి రేవంత్ తరలింపు

May 31 2015 8:58 PM | Updated on Aug 17 2018 12:56 PM

ఏసీబీ కార్యాలయానికి రేవంత్ తరలింపు - Sakshi

ఏసీబీ కార్యాలయానికి రేవంత్ తరలింపు

టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని హైదరాబాద్ బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తరలించారు.

హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేసేందుకోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్కు డబ్బులు పంపిణీ చేస్తుండగా అరెస్ట్ అయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని హైదరాబాద్ బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఆదివారం రాత్రి ఏసీబీ అధికారులు గాంధీ ఆస్పత్రిలో రేవంత్కు వైద్య పరీక్షలు చేయించిన అనంతరం కార్యాలయానికి తీసుకువెళ్లారు. రేవంత్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాసేపట్లో అరెస్ట్ చేసినట్టు ప్రకటించే అవకాశముంది. ఏసీబీ అధికారులు రేవంత్ వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. ఎమ్మెల్యే స్టీఫెన్ కూడా ఏసీబీ కార్యాలయంలో ఉన్నారు.ఈ కేసులో ఆయనను సాక్షిగా పరిగణించనున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement