ధోబీ ఘాట్ల ఏర్పాటుకు తీర్మానం హర్షణీయం | resolution in trs plenary meeting | Sakshi
Sakshi News home page

ధోబీ ఘాట్ల ఏర్పాటుకు తీర్మానం హర్షణీయం

Apr 24 2015 8:41 PM | Updated on Mar 28 2018 11:08 AM

హైదరాబాద్ లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశంలో జిల్లాల్లో అధునాతనమైన ధోబీ ఘాట్లను ఏర్పాటు చేయాలని తీర్మానం చేయడం హర్షణీయమని తెలంగాణ రాష్ట్ర రజక జేఏసీ ఫౌండర్ చైర్మన్ పంజగారి ఆంజనేయులు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

మేడ్చల్ (రంగారెడ్డి జిల్లా) : హైదరాబాద్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశంలో జిల్లాల్లో అధునాతనమైన ధోబీ ఘాట్లను ఏర్పాటు చేయాలని తీర్మానం చేయడం హర్షణీయమని తెలంగాణ రాష్ట్ర రజక జేఏసీ ఫౌండర్ చైర్మన్ పంజగారి ఆంజనేయులు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

రజకుల పట్ల అభిమానంతో ఏకగ్రీవంగా ఈ తీర్మానం చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణలోని 10 జిల్లాల రజకులు రుణపడి ఉన్నామని తెలిపారు. ధోబీ ఘాట్లకు ఉచిత కరంట్, వాటి నిర్మాణానికి స్థలాన్ని అందించాలన్నారు. అదే విధంగా చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement