పేకాట ఆడుతూ పట్టుబడ్డ ఆర్డీవో | Rdo arrested while playing cards | Sakshi
Sakshi News home page

పేకాట ఆడుతూ పట్టుబడ్డ ఆర్డీవో

Jul 3 2017 3:06 PM | Updated on Sep 5 2017 3:06 PM

ఓ ఆర్డీవో ఇద్దరు డీటీలు, ఒక రెవెన్యూ ఇన్స్ పెక్టర్ పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డారు.

ఖమ్మం: ఓ వైపు పేకాటపై సీఎం కేసీఆర్ ఉక్కుపాదం మోపుతుండగా.. మరో వైపు ప్రభుత్వ జీతం తీసుకుంటున్న అధికారులే యధేచ్చగా పేకాట ఆడుతున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెర్వుమాదారం సమీపంలో ఓ ఆర్డీవో ఇద్దరు డీటీలు, ఒక రెవెన్యూ ఇన్స్ పెక్టర్ పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డారు.

వీరంతా సదరు ఆర్డీవో ఫాంహౌస్ లో పేకాట ఆడుతుండగా సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే అధికారులు పట్టుబడ్డ విషయం బయటకి రాకుండా మేనేజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement