రైతులకే ఎన్‌డీఎస్‌ఎల్ | Raitulake endiesel | Sakshi
Sakshi News home page

రైతులకే ఎన్‌డీఎస్‌ఎల్

Mar 11 2015 3:43 AM | Updated on Oct 1 2018 2:00 PM

నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్‌డీఎస్‌ఎల్) ప్రరుువేటు భాగస్వామ్యాన్ని రద్దుచేసి, ప్రభుత్వం స్వాధీనం చేసుకొని రైతులకు అప్పగిస్తామని

బోధన్: నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్‌డీఎస్‌ఎల్) ప్రరుువేటు భాగస్వామ్యాన్ని రద్దుచేసి, ప్రభుత్వం స్వాధీనం చేసుకొని రైతులకు అప్పగిస్తామని ము ఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం చేసి న ప్రకటన రైతులు, కార్మికులలో ఆ నందం నింపింది. కానీ, ఫ్యాక్టరీని ప్రభుత్వమే నడపాలని వారు కోరుతున్నారు.

ప్రరుువేటీకరణ రద్దు శుభసూచకమే అరుునప్పటికీ, కర్మాగారం ప్రభుత్వ ఆధీనంలో ఉండడమే సరైందనే అభిప్రా యం వ్యక్తమవుతోంది. టీఆర్‌ఎస్ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు చక్కెర   పరి శ్రమలను స్వాధీనం చేసుకునే దిశగా చర్యలు  చేపట్టింది. ఈ క్రమంలోనే నిజాం షుగర్స్‌పై సీఎం స్పష్టత ఇచ్చారు.
 
అతి పెద్ద పరిశ్రమ
ఆసియా ఖండంలోనే అతిపెద్ద వ్యవసాయూధారిత పరిశ్రమ అయిన ఎన్‌డీఎస్‌ఎల్‌ను 1936లో ఏర్పా టు చేశారు. ఈ పరిశ్రమ జిల్లా ఆర్ధిక, సామాజిక అభివధ్దికి ఎంత గానో దోహద పడింది.
 
దీని లాభాలతో రాష్ర్టవ్యాప్తంగా చక్కెర పరిశ్రమలు విస్తరిం చాయి. నిజాం పాలకులు బోధన్ ప్రాంతంలో 16 వేల ఎకరాల భూమిని కేటాయించి 14 వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేశారు. వేలాది మంది కార్మికులకు ఉపాధి లభించింది. చెరుకు సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఫ్యాక్టరీ ప్రారంభంలో 2, 50 0 మంది కార్మికులు పని చేశారు.

క్రమంగా ఆ సంఖ్య ఐదు వేల కు చేరుకుంది. రైతులు పండించిన చెరుకు పంటకు లాభసాటి ధర అం దింది. బోధన్ ఫ్యాక్టరీ లాభాలతో మెదక్ జిల్లా ముంబోజిపల్లిలో, కరీంనగర్ జిల్లా మెట్‌పల్లి ప్రాంతంలోని ముత్యంపేట వద్ద నిజాం షుగర్ ఫ్యాక్టరీ యూనిట్లను 1980 దశకంలో ఏర్పాటు చేశారు. ఈ ఫాక్టరీల క్రషింగ్ కెపాసీటీ 2,500 టన్నులు.
 
2002లో ప్రరుువేటీకరణ
లాభాల బాటలో నడుస్తున్న ఫ్యాక్టరీలను 2002లో చంద్రబాబు నాయుడు జాయింట్ వెంచర్ పేరుతో ప్రరుువేటీకరించారు. డెల్టా పేపర్ కంపెనీకి ఫ్యాక్టరీ నిర్వాహణ అధికారాన్ని కట్టబెట్టారు.
 
వైఎస్‌ఆర్ హయాంలో సభాసంఘం
2004లో అధికారంలోకి వచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు సభాసంఘం వేశారు. 2006 అగస్టు 31న ప్రభుత్వానికి సభాసంఘం నివేదికను ఇచ్చింది. యూనిట్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సిఫారసు చేసింది. వైఎస్‌ఆర్ మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం సభా సంఘం సిఫారసులను పట్టించుకోలేదు.  
 
రాష్ట్ర విభజన తర్వాత
రాష్ట్ర విభజన తరువాత జరిగిన ఎన్నికలలో టీఆర్‌ఎస్ నిజాం షుగర్స్ ను స్వాధీనం చేసుకుంటామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం బోధన్, మెట్‌పల్లి, మెదక్ పరిశ్రమల పరిధిలోని రైతులతో సమావేశా లు ఏర్పాటు చేసింది. 2015 జనవరిలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నేత్వత్వంలో మహారాష్ట్ర, కర్టాటక ప్రాంతంలోని సహాకార చక్కెర పరిశ్రమల నిర్వహణకు రైతులను అధ్యయనాన్ని తీసుకెళ్లారు. అనంతరం ఇప్పుడు నిజాం షుగర్స్ స్వాధీనం అంశంపై సీం స్పష్టత ఇచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement