ఇంట్లో నీటి ఊట..భయంలో ప్రజలు | Rain Problems | Sakshi
Sakshi News home page

ఇంట్లో ఊట.. కుంగుతున్న పునాదులు..!

Aug 27 2018 12:17 PM | Updated on Aug 27 2018 12:17 PM

Rain Problems  - Sakshi

ఉబికి వస్తున్న నీరు   

టేకులపల్లి  ఖమ్మం : టేకులపల్లిలోని భీంసింగ్‌ తండాలో ఓ గిరిజన కుటుంబం బిక్కుబిక్కుమంటోంది. ఈ తండాలోని ఓ ఇంటిలో బానోతు లచ్చు–గమ్లీ దంపతులు, వారి కుమారుడు బిచ్చు, కోడలు అనూష, మనుమలు, మనుమరాలు ఉంటున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం వీరిది. వర్షాలు పడితే చాలు.. వీరు భయంతో వణుకుతున్నారు. వర్షాల కారణంగా ఇంట్లో ఊట ఏర్పడింది. అందులో నుంచి నీరు ఉబికి వస్తోంది. ఇంట్లోని నేల, పునాదులు కుంగుతున్నాయయి. ఇటీవలి వర్షాలతో ఊట మరీ ఎక్కువైంది. ఉన్నతాధికారులు స్పందించి ఆదుకోవాలని, డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు మంజూరు చేయాలని ఈ కుటుంబం వేడుకుంటోంది.

Advertisement
 
Advertisement
Advertisement