breaking news
rain problems
-
ఇంట్లో నీటి ఊట..భయంలో ప్రజలు
టేకులపల్లి ఖమ్మం : టేకులపల్లిలోని భీంసింగ్ తండాలో ఓ గిరిజన కుటుంబం బిక్కుబిక్కుమంటోంది. ఈ తండాలోని ఓ ఇంటిలో బానోతు లచ్చు–గమ్లీ దంపతులు, వారి కుమారుడు బిచ్చు, కోడలు అనూష, మనుమలు, మనుమరాలు ఉంటున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం వీరిది. వర్షాలు పడితే చాలు.. వీరు భయంతో వణుకుతున్నారు. వర్షాల కారణంగా ఇంట్లో ఊట ఏర్పడింది. అందులో నుంచి నీరు ఉబికి వస్తోంది. ఇంట్లోని నేల, పునాదులు కుంగుతున్నాయయి. ఇటీవలి వర్షాలతో ఊట మరీ ఎక్కువైంది. ఉన్నతాధికారులు స్పందించి ఆదుకోవాలని, డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేయాలని ఈ కుటుంబం వేడుకుంటోంది. -
చినుకు పడితే చిత్తడే..
సాక్షి, హైదరాబాద్: నగరంలో నిన్నటి దాకా ఎండవేడిమితో అల్లాడిన ప్రజలకు వర్షం ఉపశమనం కలిగించినప్పటికీ, పలు ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు సృష్టించింది. గురువారం కురిసిన 3 సెం.మీ. అకాల వర్షానికి అనేక ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. చెట్లు, హోర్డింగ్‌లు కుప్పకూలి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. జలమయమైన ప్రాంతాలతో ట్రాఫిక్ స్తంభించింది. చెట్లు కూలడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రోడ్లపై ప్రయాణించారు. ఎంజే మార్కెట్, నిజాం పీజీ కాలేజ్, యాకుత్‌పురా యూఆర్బీ, దూద్‌బౌలి జంక్షన్, అక్బర్‌నగర్, పటేల్‌నగర్, ఛత్రినాక, జంగమ్మెట్, భవానీనగర్, అల్ జుబేల్ కాలనీ, మోడల్ హౌస్, బైబిల్ హౌస్, గోల్నాక అక్వాకేఫ్, మెడిసిటీ హాస్పిటల్, అంబర్‌పేట ఛే నెంబర్, రంగమహల్, గోల్నాక బ్రిడ్జి, ఆలుగడ్డబావి, ఆంధ్రయువతి మండలి, నింబోలి అడ్డ, తిలక్‌నగర్ రైల్వే బ్రిడ్జి, ఏఎస్రావు నగర్, ఓల్డ్ అల్వాల్, ఉప్పల్, కాప్రా, చర్లపల్లి, మల్లాపూర్, నాచారం, రామంతాపూర్, హబ్సిగూడ తదితర ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. రెజిమెంటల్‌బజార్, సెయింట్ మేరీస్‌రోడ్ తదితర ప్రాంతాల్లో రోడ్డు మీదకు వరద నీరు చేరింది. పికెట్ పార్కు చెరువును తలపించింది. మలక్‌పేట్, నల్గొండ క్రాస్‌రోడ్డు, సైదాబాద్, సరూర్‌నగర్, ఆర్కేపురం తదిర ప్రాంతాల్లో ట్రాఫిక్ జాంతో వాహనాలు నిలిచిపోయాయి. మూసారంబాగ్, సలీంనగర్, అక్బర్‌బాగ్, చాదర్‌ఘాట్ ప్రాంతాల్లో ప్రధాన రోడ్లతో పాటు అంతర్గత రోడ్లు నీటమునిగాయి. మలక్‌పేట్‌లోని పలు అపార్టుమెంట్ల సెల్లార్లలోకి వరదనీరు చేరింది. కూలిన చెట్లు.. విరిగిన హోర్డింగులు ఈదురు గాలులకు అనేక ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై చెట్లు పడి వాహనాలు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. గ్రేటర్ అధికారుల అంచనా ప్రకారం 120కి పైగా చెట్లు కూలాయి. శివంరోడ్డు డీడీ కాలనీ, సీపీఎల్ రోడ్డు, కాచిగూడ తదితర ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ఈస్ట్ మారేడ్‌పల్లిలో భారీ చెట్టు రోడ్డుపై కూలడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పేట్లబురుజు వద్ద రోడ్డుపై వెళుతున్న ఆటోరిక్షాపై చెట్టు కూలడంతో ఆటో ధ్వంసమైంది. ఎన్టీఆర్గార్డెన్ పార్కింగ్ వద్ద చెట్లు పడి ఆటో, కారు ధ్వంసమయ్యాయి. ఎన్టీఆర్‌మార్గ్‌లో ఫుట్‌పాత్‌పై ఉన్న భారీ వృక్షాలు కూకటి వేళ్లతో సహా నేలకొరిగాయి. ఇందిరాపార్కు, గాంధీనగర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో చెట్లు కూలాయి. రాజ్‌భవన్‌రోడ్‌లో ఆర్చి కూలిపోయింది. బలమైన ఈదురుగాలుల వల్ల ఖైరతాబాద్ హైటెక్స్, తాడ్బంద్ తదితర ప్రాంతాల్లో హోర్డింగ్‌ల ఫ్లెక్సీలు చినిగిపోయాయి. సమస్యలకు పరిష్కారమెప్పుడు? గురువారం కురిసిన వర్షంతో ఎదురైన ఇబ్బందులు రాబోయే వర్షాకాలానికి ముందస్తు హెచ్చరికగా నిలిచాయి. ప్రస్తుత సంవత్సరం సైతం దాదాపు 325 సమస్యాత్మక ప్రాంతాలున్నట్లు గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారులు.. దాదాపు రూ.100 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. ఆయా ప్రాంతాల్లోని సమస్యల్ని బట్టి బీటీ, సీసీ, పేవర్‌బ్లాక్ రోడ్లు వేయడం పైప్లైన్లు, ఆర్సీసీ కల్వర్టుల, వరద కాలువల నిర్మాణం, క్యాచ్పిట్స్ ఏర్పాటు తదితర చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. వీటిలో ఇప్పటి వరకు 150 పనులు మాత్రమే పూర్తయినట్లు సమాచారం. -
వర్షార్పణమే..
రాజవొమ్మంగి : జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన కురిసిన భారీ వర్షం కురిసింది. రాజవొమ్మంగి, గోకవరం, జగ్గంపేట, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులకు చెట్లు నేలకొరిగాయి. రాజవొమ్మంగిలో చెట్టుకొమ్మలు విద్యుత్ లైన్లపై పడి వైర్లు తెగిపోవడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. మరో 24 గంటలకు కానీ విద్యుత్ సరఫరాను పూర్తిగా పునరుద్ధరించలేమని ట్రా¯Œ్సకో ఏఈ మాగంటి దొరబాబు తెలిపారు. అడ్డతీగల– వేటమామిడి మధ్య చెట్లు పడిపోవడంతో ప్రధాన విద్యుత్లైన్లు తెగిపడ్డాయన్నారు. ఏలేశ్వరం సమీపంలో 33/11 కేవీ లై¯ŒS దెబ్బతిన్నట్టు చెప్పారు. రాజవొమ్మంగికి కొన్ని గంటల్లోనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినా లోతట్టు గ్రామాలకు విద్యుత్ అందించేందుకు సమయం పడుతుందన్నారు. నర్సీపట్నం–దేవీపట్నం రహదారిపై పలుచోట్ల చెట్లు కూలిపోయాయి. దీంతో వాహనచోదకులు ఇబ్బంది పడ్డా రు. భారీ కొబ్బరి చెట్టు మీద పడడంతో దూసరపాము గ్రామంలోని పెదపూడి ఏసు బాబు తాటాకిల్లు, రిక్షా దెబ్బతిన్నాయి. మండలంలోని కొండపల్లి, లాగరాయి తదితర గ్రామాల్లో ఈదురుగాలులకు భారీ నష్టం వాటిల్లింది. పాడి ఆవు మృతి రాజవొమ్మంగిలోని ఈదురుగాలులకు సమీపంలో ఓ భారీ తాటిచెట్టు కూలిపోయింది. అదే సమయంలో మేతకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న పాడి ఆవుపై ఈ తాటిచెట్టు పడడంతో ఆవు అక్కడికక్కడే మరణించింది. రూ.10వేలకు పైగా విలువైన పాడి ఆవు మరణించడంతో యజమాని పెదపూడి నాగరాజు (దూసరపాము) నష్టపోయాడు. జడ్డంగి గ్రామంలోని ఎస్సీపేటలో చెట్టుకూలిపోవడంతో పేకేటి రాంబాబు వంటిషెడ్డు దెబ్బతింది. ఈదురుగాలుల కారణంగా మామిడితోటలకు నష్టం వాటిల్లింది. పక్వానికి వస్తున్న మామిడి పండ్లు వడగళ్ల వానకు, ఈదురుగాలులకు నేలరాలి తీవ్ర నష్టం వాటిల్లింది.