నా అభిమానుల కోసం నిర్వహిస్తున్నా: రాహుల్‌

Rahul sipligunj Arranging A Music Programme At Kondapur - Sakshi

29న సంగీత విభావరి

నన్ను గెలిపించిన వారికోసం ప్రత్యేకం

ప్రవేశం ఉచితం

బిగ్‌బాస్‌–3 విజేత రాహుల్‌ సిప్లిగంజ్‌ 

సాక్షి, గచ్చిబౌలి : తనకు ఓట్లేసి గెలిపించిన వారి కోసం ప్రత్యేకంగా సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు బిగ్‌ బాస్‌–3 విజేత రాహుల్‌ సిప్లిగంజ్‌ తెలిపారు. సోమవారం కొండాపూర్‌లోని సౌండ్‌ గార్డెన్‌ కేఫ్‌లో ‘లైవ్‌ కన్సర్ట్‌’ టీజర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 29న పీపుల్స్‌ ప్లాజాలో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సంగీత విభావరి ఉంటుందన్నారు. ప్రవేశం ఉచితమని, తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ఓట్లేసిన వారు, అభిమానులు వచ్చే అవకాశం ఉందన్నారు. పునర్నవి, శివ జ్యోతి, శ్రీముఖితో పాటు బిగ్‌ బాస్‌–3లోని సభ్యులను ఆహ్వానించానని చెప్పారు. తాను ఓ సాధారణ కామన్‌ మ్యాన్‌ను అన్నారు.

సినిమాలకు పాటలు పాడితే వచ్చే ఆదాయం సరిపోక...2013 నుంచి మ్యాజిక్‌ వీడియోస్‌ తీశానన్నారు. లక్షలు ఖర్చు చేస్తే ‘మాకీ కిరికిరి’ అనే పాటకు మొన్నమొన్న గుర్తింపు వచ్చిందన్నారు. సంగీత విభావరిలో పెద్ద స్టేజిపై టాలీవుడ్‌కు చెందిన ఓ సింగర్‌ సొంత పాటలు సోలోగా పాడబోతున్నాడని చెప్పారు. టాలెంట్‌ సింగింగ్‌తో థ్యాంక్స్‌ తెలియజేస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు బాగా ఆదరించారని చెప్పారు. బిగ్‌బాస్‌–3లో తన వ్యక్తిత్వాన్ని పాజిటివ్‌గా ప్రజెంట్‌ చేసినందుకు మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top