
రామగుండంలో రహదారిపై కొండచిలువ
గోదావరిఖని(రామగుండం): గోదావరిఖని మున్సిపల్ కార్యాలయం సమీపంలోని రహదారిపై సోమవారం రాత్రి కొండచిలువ ప్రత్యక్షమైంది. సమీపంలో నిర్జన ప్రదేశం నుంచి రహదారిపైకి వచ్చి మున్సిపల్ కార్యాలయంలో పాత వాహనాలు ఉండడంతో వాహనాల తుప్పు తినేందుకు వెళ్తుండగా జనం గుర్తించా రు.
పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ దొరకకపోవడంతో కర్రతో చంపేశారు. కాగా ప్రధాన రహదారిపై ఒక్కసారిగా కొండచిలు వ ప్రత్యక్షం కావడంతో స్థానిక ప్రజలు ఆం దోళనకు గురయ్యారు. దీంతో 20 నిమిషాల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.