నేడు నగరానికి పూర్ణిమ సాయి | purnima sai to return mumbai today | Sakshi
Sakshi News home page

నేడు నగరానికి పూర్ణిమ సాయి

Jul 19 2017 2:02 AM | Updated on Sep 5 2017 4:19 PM

నేడు నగరానికి పూర్ణిమ సాయి

నేడు నగరానికి పూర్ణిమ సాయి

హైదరాబాద్‌లో అదృశ్యమై ముంబైలో ఆచూకీ లభించిన పూర్ణిమ సాయి బుధవారం ఉదయం హైదరాబాద్‌కు తిరిగి చేరనుంది.

ముంబై నుంచి తీసుకువస్తున్న సైబరాబాద్‌ పోలీసులు
సాక్షి, హైదరాబాద్‌:
హైదరాబాద్‌లో అదృశ్యమై ముంబైలో ఆచూకీ లభించిన పూర్ణిమ సాయి బుధవారం ఉదయం హైదరాబాద్‌కు తిరిగి చేరనుంది. సైబరా బాద్‌ పోలీసులు ఆమెను హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు. గత నెల 7వ తేదీన పూర్ణిమ సాయి ఆచూకీ లేకుండా పోయిన విషయం తెలిసిందే.  ముంబైలో డోం గ్రీ ప్రాంతంలోని బాలల గృహంలో ఆమె ఉన్నట్టుగా ఆదివారం గుర్తించారు. సోమవారం ఆమె తల్లిదండ్రులు నాగరాజు, విజయకుమారి, సైబరాబాద్‌ పోలీ సులు కలసి ముంబైకి వెళ్లారు. తన తల్లిదండ్రులను కలిసేందుకు, వారితో తిరిగి వచ్చేందుకు పూర్ణిమ నిరాకరించింది. దీంతో వారు అదే రోజున తిరిగి హైదరా బాద్‌కు వచ్చేశారు.

అనంతరం సైబరాబాద్‌ పోలీసులు పూర్ణిమ సాయిని తీసుకుని హైదరాబాద్‌కు బయలుదేరారు. బుధవారం ఇక్కడికి చేరుకోగానే ఆమెను నేరుగా సైదాబాద్‌లోని సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్‌ పద్మావతి ఎదుట హాజరుపర్చనున్నట్టు తెలిసింది. పూర్ణిమ సాయి ఇష్టప్రకారం తల్లిదండ్రుల వద్దకు వెళతానంటే వారికి అప్పగిస్తారు. లేకపోతే కాచిగూడలోని ప్రభుత్వ బాలికల రెస్క్యూ హోమ్‌కు తరలించే అవకాశముంది. కాగా తమ కుమార్తె పూర్ణిమ సాయి తమ వద్దకే వస్తుందని ఆమె తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement