రేపు పల్స్ పోలియో | Pulse polio drive from Sunday | Sakshi
Sakshi News home page

రేపు పల్స్ పోలియో

Jan 17 2015 12:42 AM | Updated on Mar 28 2018 11:11 AM

రేపు పల్స్ పోలియో - Sakshi

రేపు పల్స్ పోలియో

పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ జి.సుబాష్ చంద్రబోస్ తెలిపారు.

రాజేంద్రనగర్: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించనున్నట్లు  జిల్లా  వైద్యాధికారి డాక్టర్ జి.సుబాష్ చంద్రబోస్ తెలిపారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లును పూర్తి చేశామన్నారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో మొత్తం ఏడు లక్షల18వేల 124 మంది పిల్లలకు పోలియో చుక్కలను వేయనున్నామన్నారు.

ఇందుకోసం 11,160 మంది సిబ్బందిని నియమించామన్నారు. 19, 20 తేదీల్లో ఇంటింటికీ తిరిగి చుక్కలు వేస్తామన్నారు. 67 మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు. రెండో విడతగా ఫిబ్రవరి 22న మరోసారి చుక్కలు వేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్లు వి.నిర్మల్‌కుమార్, నరహరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement