రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బీటెక్ విద్యార్ధి కుటుంబానికి న్యాయం చేయాలంటూ రోడ్డుపై మృతదేహాం పెట్టి ధర్నాకు దిగిన సంఘటన రిబ్బనలో జరిగింది.
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బీటెక్ విద్యార్ధి కుటుంబానికి న్యాయం చేయాలంటూ రోడ్డుపై మృతదేహాం పెట్టి ధర్నాకు దిగిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా రిబ్బనలో జరిగింది. బీటెక్ చదువుతున్న సాయి ప్రసాద్ మంగళవారం రాత్రి బైక్‌పై వెళుతుండగా డివిజనల్ ఫారెస్టు ఆఫీసరు కారు ఢీకొట్టింది. విద్యార్థికి అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యార్థి మృతికి కారణమైన డిఎఫ్‌ఓని ఆరెస్టు చేసి, ఆ కుటుంబానికి తగిన న్యాయం చేయాలంటూ సాయి ప్రసాద్ మృత దేహంతో అతని స్నేహితులు రిబ్బనలోని గోలేటి ఎక్స్ రోడ్డులో ధర్నాకు దిగారు. డిఎఫ్‌ఓను అరెస్టు చేస్తామని స్థానిక సీఐ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.